Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పట్టిసీమ మీద ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకెళ్లిన ఏపీ సర్కార్ ప్రయత్నం ఫలిస్తోంది. ఈ ఏడాది పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకి 100 టీఎంసీ ల నీరు అందే అవకాశం కనిపిస్తోంది. ఇక వర్షాలు సమృద్ధిగా ఉంటే గోదావరి జలాలు రాయలసీమ సాగు అవసరాలు కూడా తీర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పట్టిసీమ నుంచి వచ్చే నీటితో కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు రంగం సిద్ధం అయ్యింది.
ఇప్పటికే పట్టిసీమ నుంచి విడుదల చేసిన 3500 క్యూసెక్కుల నీరు కృష్ణా జిల్లా సీతారామపురం దగ్గర కృష్ణా జలాల్లోకి ప్రవేశించింది. స్థానిక రైతులు పూజలతో గోదారమ్మకు ఆహ్వానం పలికారు. ఈ నీటితో ఆకుమళ్లు, వరినాట్లు వేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. పట్టిసీమ ఏర్పడ్డాక గోదావరి నుంచి కృష్ణడెల్టాకి జలాలు తరలిరావడం ఇది రెండోసారి. ఈ ఏడాది పట్టిసీమ పుణ్యమా అని కృష్ణా డెల్టాలో వరిసాగు అనుకున్న దాని కన్నా ముందే మొదలు కాబోతోంది.