ఫ్యాన్స్ కి సూచనలు చేసిన పవన్, ఏంటో మీరూ వినండి

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలు, తాజా పరిస్థితులపై చర్చించేందుకు అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖులు ఈరోజు సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో క్యాస్టింగ్‌ కౌచ్‌, చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, ఈ సమావేశానికి ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా వస్తారని తెలిసి భారీ సంఖ్యలో ఆయన అభిమానులు అక్కడకు చేరుకున్నారు. ఒకానొక దశలో పవన్ ఫ్యాన్స్ ని అక్కడి నుండి పంపించి వేయడానికి అసలు అక్కడ ఎలాంటి సమావేశాలు జరగడం లేదని ఈరోజు జరగాల్సిన సమావేశం రద్దయ్యింది అని ప్రకటించాల్సి వచ్చింది.

అయితే అయిన సరే కొందరు అభిమానులు పవన్ కోసం వేచి ఉన్నారు. అయితే వారిని కలిసేందుకు పవన్ సమావేశం నుంచి బయటికి వచ్చారు. పవన్ కళ్యాణ్ వారిని కలిసేందుకు బయటికి రావడంతో సీఎం పవన్ నినాదాలతో హోరెత్తించారు అభిమానులు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కాసేపు మాట్లాడి, ఫ్యాన్స్ కి కీలక సూచనలు చేశారు. ఒక ఆడపిల్ల బట్టలు లేకుండా ఉంటె ఎవరం అయిన బట్టలు ఇస్తామని, కాని వాళ్ళు వీడియో తీసారని, అలాగే ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉండి ఆమె రోడ్దేక్కితే పవన్ కళ్యాన్ ఎలా బాధ్యుడు అని ప్రశ్నించాడు. ఎవరూ చట్టలకి అతీతులం కాదు కాబట్టే ఆమెని లీగల్ గా వెళ్ళమన్నాను అని పవన్ అన్నారు.

టీవీ9 రవిప్రకాశ్‌తో తనకు వ్యక్తిగత సమస్యల్లేవని అన్నారు. పదే పదే తనను వివాదంలోకి లాగుతుంటే ఏం చేయాలని ప్రశ్నించారు. శుక్రవారం తన అభిమానుల మీద కేసులు కూడా పెట్టారని పవన్ చెప్పారు. పోలీసు అధికారులు వచ్చి ‘సార్ మీ పిల్లలు(అభిమానులు) కార్ల అద్దాలను పగలగొట్టారు’ అని తనకు చెప్పారని పవన్ తెలిపారు. తానేమైనా గొడవ చేయమని చెప్పానా? వారెందుకు చేస్తారు? అని తాను వ్యాఖ్యానించినట్లు చెప్పారు. 8నెలల నుంచి తనను తిట్టీ తిట్టీ పోస్తున్నారని ఓ మీడియా, టీడీపీనుద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. చివరకు తన తల్లిని కూడా తిట్టి, వీధిలోకి లాగారని పవన్ అన్నారు. అయినా, చిన్నపాటి కోపం కూడా రాకూడదంటే ఎలా? అని పోలీసులతో అన్నానని మీడియాకు.. వాటి అధినేతలకు, అధికారులకు చెప్పండని తాను పోలీసులకు సూచించినట్లు తెలిపారు.

అందరికీ కోపాలు తెప్పించి.. శాంతంగా ఉండాలంటే ఎలా అని పవన్ నిలదీశారు. అయితే, తాము కూడా ఈ విషయంలో నిస్సహాయులమేనని పోలీసులు తెలిపారని అన్నారు. సుదీర్ఘమైన న్యాయ పోరాటం చేద్దామని పవన్ తన అభిమానులతో చెప్పారు. అయితే, అభిమానులు ఎవ్వరూ కూడా కోపం తెచ్చుకోకూడదని అన్నారు. వాళ్లు తెలివిగా కుట్రలు చేస్తున్నారని అభిమానులకు చెప్పారు. తాను చెప్పే వరకూ శాంతంగా ఉండాలని పవన్ అభిమానులకు సూచించారు. మీ అభిమానులం కాబట్టే ఇప్పటికీ శాంతియుతంగానే ఉన్నామని, లేదంటే వాళ్ల ప్యాంట్లు తడిచిపోయేవంటూ పలువురు అభిమానులు వ్యాఖ్యానించారు.

న్యాయవాదులతో మాట్లాడి, లీగల్‌గా వెళదామని చెప్పారు. కోపం వద్దు.. తప్పు చేసింది వాళ్లైతే.. మనమెందుకు కేసులు పెట్టించుకోవాలని ప్రశ్నించారు. అలాగే ఏమయినా చేయాల్సి వచ్చినప్పుడు తనే స్వయంగా చెబుతానని అప్పటి దాక కోపం వద్దంటూ పవన్ తన అభిమానులకు దండం పెట్టి చెప్పారు. ఆ తర్వాత అక్కడ్నుంచి స్టూడియో లోపలికి వెళ్లిపోయారు పవన్.