సోమవారం అర్ధరాత్రి దాటాక మూడో జాబితా విడుదల చేసిన జనసేన పార్టీ మంగళవారం మరో జాబితాను ప్రకటించింది. దీంతో మొత్తం ఇప్పటివరకూ ఏపీలోని 64 శాసనసభ స్థానాలకు, 7 లోక్‌సభ స్థానాలకు.. తెలంగాణలో రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులన ప్రకటించినట్లయ్యింది. ఇటీవలే పార్టీలో చేరిన సీబీఐ మాజీ జేడీ వి.వి. లక్ష్మీనారాయణకు విశాఖ లోక్‌సభ స్థానాన్ని కేటాయించింది. మరో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు కూడా పవన్ అభ్యర్థులను ఖరారు చేశారు. విశాఖపట్నం ఉత్తరం నుంచి పసుపులేటి ఉషాకిరణ్, విశాఖ దక్షిణం నుంచి గంపల గిరిధిర్ బరిలో ఉంటారని జనసేన తెలిపింది. భీమిలీ నుంచి పంచకర్ల సందీప్, అమలాపురం నుంచి శెట్టిబత్తుల రాజబాబు, పెద్దాపురం నుంచి తుమ్మల రామస్వామి పోటీ చేస్తారు. పోలవరం నుంచి చిర్రి బాలరాజు, అనంతపురం నుంచి టి.సి. వరుణ్ బరిలో దిగనున్నారు. లక్ష్మీనారాయణ తోడల్లుడు విశ్వవిద్యాయాలకు కులపతిగా పని చేసిన రాజగోపాల్‌కి పార్టీలో ఉన్నతమైన ఓ కమిటీకి చైర్మన్‌గా నియమించనున్నట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు.
విశాఖ పట్టణం ఉత్తరం – పసుపులేటి ఉషా కిరణ్
విశాఖ పట్టణం దక్షిణం – గంపల గిరిధర్
విశాఖ పట్టణం తూర్పు – శ్రీ కోనా తాతారావు
భీమిలి – శ్రీ పంచకర్ల సందీప్
అమలాపురం – శ్రీ శెట్టి బత్తుల రాజబాబు
పెద్దాపురం – శ్రీ తుమ్మల రామస్వామి బాబు
పోలవరం – శ్రీ చిర్లి బాలరాజు
అనంతపురం – శ్రీ టి.సి వరుణ్