తాను ఇక సినిమాలను పక్కన పెట్టానని ప్రజా జీవితమే తన జీవితమని మంచి ఎమోషనల్ డైలాగ్స్ తో ప్రజా పోరాట యాత్ర చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కి పనయి పోయిందట. అదేంటి పవన్ కి పనవ్వడం ఏంటి అనుకుంటున్నారా ? అయితే చదవండి ఏపీ మొత్తం చుట్టేసి వస్తాను, నా ప్రజల కష్టాలు తీర్చేస్తాను అంటూ మొదలు పెట్టిన ప్రజా పోరాట యాత్ర కేవలం ఐదు జిల్లాల్లోనే చేపట్టి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అది కూడా తీరికగా సమయం కుదిరినప్పుడు చేస్కుంటూ వెళ్లారు. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ప్రజల్లో చురుకుగా కదులుతుంటూ తమ ప్రచారాలు చేస్తుంటే.. పవన్ మాత్రం తీరికగా వీలు కుదిరినప్పుడు పోరాట యాత్ర అనటం, విదేశాలు తిరగటం చూసి నిజంగానే ప్రజలు నవ్వుకుంటున్నారు. పవన్ చొరవతో రాజకీయంలో కూడా కాల్షీట్స్ వస్తాయేమో ! రాజకీయం అంటే ఓర్పు, నేర్పు, చురుకుదనం, మాటకారిదనం ఉండాలి. అవేవీ పవన్ లో అయితే ఇప్పటికి కనిపించలేదు అని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.
ఇక ఇవన్నీ ఇలా ఉంటే పవన్ పోటీ చేసేది ఈ ఐదు జిల్లాల్లోనే అనే వార్త ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది. ఆయన కేవలం ఐదు జిల్లాలలోమాత్రమే పోరాటయాత్ర చేశారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రమే తిరిగారు. అది కూడా ఎప్పుడు డుమ్మా కొట్టాలనుకుంటే అప్పుడు డుమ్మా కొట్టేస్తూ చాలా సిల్లీ రీజన్స్ చెబుతూ తిరిగారు. గత ఏడాది మే నెలలో పోరాట యాత్ర చేపట్టిన పవన్ ఎక్కి దిగేది కారులె కాబట్టి నియోజకవర్గానికి ఒక రోజు వేసుకున్నా ఇప్పటికి ఏపీని చుట్టి రావాల్సింది. కానీ అలా జరగలేదు. కేవలం ఐదు జిల్లాలే పర్యటించారు. పోనే పార్టీ ఏమయినా బలంగా ఉందా అంటే కనీసం పార్టీ కార్యక్రమాలను కూడా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించలేనంతగా పరిస్థితులు ఉన్నాయి. పార్టీనే నడపలేని వ్యక్తి రేపు ప్రభుత్వాన్ని ఏమి నడుపుతాడు అనే ప్రశ్న ప్రజల్లో మొదలయితే పవన్ ఏమయిపోతాడో పాపం.