పవన్‌, త్రివిక్రమ్‌, నితిన్‌ల మూవీ టైటిల్‌ చిత్రంగా ఉంది

pawan and trivikram, nithin movie title gurthunda seethakalam

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నితిన్‌ హీరోగా పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌లు ఒక చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రానికి రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంపై సినీ వర్గాల వారితో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా చిత్రం ఉంటుందని దర్శకుడు త్రివిక్రమ్‌ నమ్మకంతో చెబుతున్నాడు. ఈ చిత్రానికి కథ మరియు స్క్రీన్‌ప్లే సహకారం త్రివిక్రమ్‌ అందించిన నేపథ్యంలో భారీ ఎత్తున ఈ చిత్రం బిజినెస్‌ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి తాజాగా టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది. టైటిల్‌ ఖరారులో త్రివిక్రమ్‌ మార్క్‌ క్లీయర్‌గా కనిపిస్తుంది.

gurthunda-seethakalam

ఈ చిత్రానికి ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లుగా సమాచారం అందుతుంది. విభిన్న తరహాలో అందరికి అర్థం అయ్యేలా టైటిల్‌ను నిర్ణయించాలనే ఉద్దేశ్యంతో, కథకు తగ్గట్లుగా ఈ టైటిల్‌ను నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది. పవన్‌, త్రివిక్రమ్‌తో పాటు ఈ చిత్రాన్ని నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి కూడా నిర్మిస్తున్నాడు. నితిన్‌ ‘లై’ చిత్రంతో దారుణమైన పరాజయంను చవిచూశాడు. ఈ చిత్రంతో అయినా సక్సెస్‌ను దక్కించుకుంటాడా అనేది చూడాలి. పవన్‌, త్రివిక్రమ్‌ బ్రాండ్‌తో ఖచ్చితంగా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.