Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని సమస్యలపైనా గళమెత్తుతున్న(కనీసం ట్విటర్లో అయినా) జనసేనాని.. ఇటీవలి కాలంలో గరగపర్రుపై మాత్రం మౌనం వహించడం చర్చనీయాంశమైంది. అయితే దీని వెనుక కుల పరమైన కారణాలున్నాయని వాదన వినిపిస్తోంది. కులాలకు అతీతుడ్నని చెప్పుకుంటున్న పవన్ కొన్ని బలమైన కారణాల వల్ల గరగపర్రు ఘటనకు దూరంగా ఉన్నారట.
నిజానికి పవన్ సొంతూరు మొగల్తూరుకు గరగపర్రు కూతవేటు దూరంలోనే ఉంటుంది. అయితే అక్కడ మాలలకు, రాజులకు మధ్య వార్ నడుస్తోంది. ఇప్పటికే కాపులు, రాజుల మధ్య గొడవలున్నాయి. ఇలాంటి సమయంలో రాజుల్ని కెలకడం ఎందుకని పవన్ మౌనం పాటిస్తున్నారు. పైగా దళితులకు కాపులపై అసలు నమ్మకం లేదు. ఎందుకంటే గోదావరి జిల్లాల్లో ఎక్కువగా దళితులపై ఆధిపత్యం చూపించేది కాపులే.
కాబట్టి తన మాట వినని దళితుల కోసం రాజుల్ని కెలకడం, కాపుల్లో పలుచన కావడం పవన్ కు ఇష్టం లేదట. పైగా ఏపీ సర్కారు కూడా పవన్ ప్రశ్నలకు పెద్దగా స్పందించకపోవడంతో.. పోయిన పరువు చాలన్నట్లుగా పవర్ స్టార్ వైఖరి ఉంది. కానీ ఓ సమస్యపై స్పందించడానికే ఇంతగా పీకులాడుతున్న పవన్.. రేపు ఎన్నికల్లో ఎలా నెగ్గుకొస్తారనే అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటికే పవన్ కు ట్విటర్ స్టార్ గా పేరొచ్చింది. కానీ నేరుగా జనాన్ని మాత్రం కలవరని కూడా అనుకుంటున్నారు.
మరిన్ని వార్తాలు