Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ పర్దటనలో వున్న జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ నేడు అమరావతి సమీపంలోని చినకాకాని వస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేయబోయే జనసేన ప్రధాన కార్యాలయ స్థలాన్ని పరిశీలిస్తారు. రాజకీయ పార్టీలు, నాయకులు అంటే భయపడే ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన కార్యాలయం ఏర్పాటు చేసుకోడానికి భూములు లీజ్ కి ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతులకు పవన్ కృతజ్ఞతలు చెబుతారు.
పవన్ చినకాకాని పర్యటనకు ఇంత ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం లేకపోలేదు. జనసేన ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తున్న చినకాకాని లో పవన్ సొంత ఇల్లు కూడా కట్టుకునే ఆలోచనలో ఉన్నారట. జాతీయ రహదారి పక్కన వున్న ఈ ఊరు గుంటూరు , విజయవాడ తో పాటు రాజధాని అమరావతికి దగ్గరలో వుంది. గన్నవరం విమానాశ్రయం వెళ్లడం కూడా ఇక్కడ నుంచి సులభమే. ఇవన్నీ ఆలోచించే చినకాకాని లో పార్టీ కార్యాలయ ఏర్పాటుకు పవన్ ముందుకు వచ్చారు. ఇక్కడ ప్రజల వ్యవహారశైలి కూడా పవన్ కి నచ్చిందట. వీటన్నిటితోపాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం కావాలి అనుకున్న పవన్ రాజధానికి దగ్గరలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలన్న పార్టీ శ్రేణుల కోరిక మేరకు పవన్ చినకాకాని మీద దృష్టి పెట్టారు. అంతా అనుకున్నట్టు జరిగితే చినకాకాని పవన్ ఊరు అవుతుంది.