Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్ మొన్న సంక్రాంతికి తన 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రం భారీ ఫ్లాప్ అయ్యింది. దాంతో పవన్ అండ్ కో తీవ్రంగా నిరాశ పడ్డారు. మెగా ఫ్యాన్స్‌కు పీడకల మాదిరిగా అజ్ఞాతవాసి మిగిలి పోయింది. రాజకీయాలు, ప్రజా సేవపై ఆసక్తి ఉన్న తాను సినిమాలు చేయడం వల్ల సక్సెస్ కావడం లేదని పవన్ భావించాడు. అందుకే ఇక పూర్తిగా రాజకీయాల్లోనే అంటూ ఇటీవల ప్రకటించాడు. అయితే పవన్ అజ్ఞాతవాసి చిత్రం తర్వాత నటించేందుకు ఇద్దరు నిర్మాతల వద్ద అడ్వాన్స్‌లు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ అడ్వాన్స్‌లు పవన్ తిరిగి ఇచ్చే పరిస్థితిలో లేడు. అందుకే కనీసం ఒక్క సినిమా అయినా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతుంది.
పవన్ కళ్యాణ్ 26వ చిత్రాన్ని మైత్రి మూవీస్ బ్యానర్లో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ఆ సినిమాకు సంబంధించిన కథా చర్చలు కూడా జరిగాయనే ప్రచారం జరిగింది. ఆ చిత్రం కోసం పవన్ త్వరలో 60 రోజుల డేట్లు కేటాయించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పక్కా స్క్రిప్ట్‌తో మొదటి షెడ్యూల్‌ను నెల రోజులు, చివరిదైన రెండవ షెడ్యూల్‌ను నెల రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేయాల్సిందిగా మైత్రి మూవీస్ నిర్మాతలకు పవన్ సన్నిహితులు చెప్పినట్లుగా తెలుస్తోంది. పవన్‌తో 60 రోజుల్లో సినిమా అంటే సాహసమే. కాని పవన్ అంతకు మించి డేట్లు ఇవ్వలేని నేపథ్యంలో దర్శకుడు పక్కాగా ప్లాన్ చేసుకుని సినిమాను పూర్తి చేయాలనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది