‘అజ్ఞాతవాసి’ ఓవర్సీస్‌ టార్గెట్‌ ఎంతో తెలుసా?

agnathavasi-movie-overseas-target-updates
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ చిత్రం మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి పండుగను నాలుగు రోజుల ముందే తెలుగు ప్రేక్షకులకు తీసుకు వచ్చేందుకు త్రివిక్రమ్‌ మరియు పవన్‌ కళ్యాణ్‌లు ఈ నెల 10న అజ్ఞాతవాసి చిత్రాన్ని విడుదల చేయబోతునన్నారు. భారీ స్థాయిలో అంచనాలున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రంను తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా మరియు ఇతర దేశాల్లో కూడా అత్యధికంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. కేవలం అమెరికాలోనే గతంలో ఎప్పుడు లేని విధంగా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే తేలిపోయింది. బాలీవుడ్‌ సినిమాలను మించిన స్క్రీన్స్‌లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

తెలుగు సినిమాలకు ఇటీవల ఓవర్సీస్‌లో మంచి డిమాండ్‌ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి ఏరియాల్లో ప్రీమియర్‌ షోలను వేయాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకున్నారు. ప్రీమియర్‌ల ద్వారా 3 మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేయాలనే పట్టుదలతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. ఇక లాంగ్‌ రన్‌లో ఓవర్సీస్‌లో ఈ చిత్రం కనీసం 7 నుండి 8 మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేస్తుందనే నమ్మకంతో చిత్ర నిర్మాత ధీమాతో ఉన్నాడు.

ఆ మేరకు డిస్ట్రిబ్యూటర్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో ‘బాహుబలి’ తర్వాత స్థానంలో అజ్ఞాతవాసి ఉంటుందని, ఖచ్చితంగా ఒక ట్రెండ్‌ సెట్టర్‌, రికార్డు బ్రేకింగ్‌ చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఇతర చిత్రాలు అన్ని కూడా గాలికి కొట్టుకు పోయేలా ‘అజ్ఞాతవాసి’ చిత్రం కలెక్షన్స్‌ ఉంటాయంటూ మెగా ఫ్యాన్స్‌ ధీమాగా ఉన్నారు.