Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ ఈ పేరు చెపితే తెలుగు ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోతారు. పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా న్యూస్ వస్తే అది నిమిషాలలో అందరికి స్ప్రెడ్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారి మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దండయాత్ర చేస్తారు. తెలుగులో మాత్రమే కాదు, మొత్తం సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడుగా ఎదిగాడు… పవన్ కళ్యాణ్ సినిమాకు జరిగే బిజినెస్, ఆ మూవీ హిట్టయితే వచ్చే వసూళ్లు చూస్తే మైండ్ పోతుంది. పవన్ సినిమాలకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్స్ వస్తే వ్యూస్, లైక్స్ విషయంలో సోషల్ మీడియాలో రికార్డులు బద్దలవుతాయి…
ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ 25 సినిమా ‘అజ్ఞాతవాసి’ టీజర్ రిలీజ్ అయింది. విడుదల అయిన కొన్ని నిమిషాలలో మిలియన్ వ్యూస్ మార్క్ ను దాటింది. 24 గంటల వ్యవధిలో ‘అజ్ఞాతవాసి’టీజర్ ఏకంగా 64 లక్షల మంది చూశారు. ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ టీజర్ 2 వ స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. సౌత్ ఇండియాలో ఒక్క రోజులో అత్యధికమంది చూసిన టీజర్ లో విజయ్ ‘మెర్శల్’ అగ్ర స్థానం దక్కించుకుంది. ఈ ‘మెర్శల్’టీజర్ ను ఏకంగా 1.12 కోట్ల మంది చూశారు. అంతకముందు రెండో స్థానంలో ఉన్న మరో తమిళ టీజర్ ‘వివేగం’ను ‘అజ్ఞాతవాసి’వెనుక్కినెట్టి రెండో స్థానాన్ని దక్కించుకుంది. అజిత్ ‘వివేగం’ సినిమా టీజర్ 24 గంటల్లో 61 లక్షల వ్యూస్ సాధించింది. కానీ లైక్స్ విషయంలో మాత్రం ‘అజ్ఞాతవాసి’ చిత్రం విజయ్ ‘మెర్శల్’రికార్డ్ ను అధిగమించింది. ‘అజ్ఞాతవాసి’టీజర్ కి 24 గంటల్లో 4.12 లక్షల లైక్స్ వచ్చాయి. ఒక్క రోజులో ఏ టీజరుకూ సౌత్ ఇండియా మూవీస్ కి ఇన్ని లైక్స్ రాలేదు.