Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25 మూవీ అజ్ఞాతవాసి. సంక్రాతి సందర్భంగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. సినిమా అయితే ఫినిష్ అయింది కానీ ఇంతవటికి ఈ చిత్రం టీజర్ మాత్రం రిలీజ్ చేయలేదు. ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఆత్రుతగా టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కి 25 మూవీ అవ్వడంతో త్రివిక్రమ్ ప్రతివిషయం పక్కా ప్లాన్ తో చేస్తున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ పవన్ ఫ్యాన్స్ ను సంతోషపెట్టే ఒక గుడ్ న్యూస్ ను బయట పెట్టాడు. అది ఏంటంటే ఫ్యాన్స్ అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా టీజర్ ని డిసెంబర్ 16 న రిలీజ్ చేయటానికి త్రివిక్రమ్ అన్ని ఏర్పాట్లు చేసేశాడు. ఈ విషయం తెలిసిన పవన్ ఫ్యాన్స్ ఆనందంతో సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.