తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తిని రేకెత్తించాయి అంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ ! అనడంలో ఎటువంటి సందేహం లేదేమో ? ఎందుకంటే బడ్డ శత్రువుగా చెప్పుకునే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేయడం. అదీ కాక పొరపాటునో గ్రహాపాటునో తెలంగాణాలో ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ఏపీలో చంద్రబాబుకు ప్లస్ అవుతుందని, అది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బందిగా మారుతుదని భావించిన ఏపీ విపక్షాలు టీఆర్ఎస్ ను గెలిపించాలన్న పట్టుదలను చూపించాయి. వైసీపీ, జనసెనలు బహిరంగంగా మద్దతు ప్రకటన చేయకపోయినా ఆ పార్టీకి చెందిన వారు తెలంగాణలో తమ సానుభూతి పరులందరికీ సంకేతాలు పంపారు. కూకట్ పల్లి లాంటి నియోజకవర్గాల్లో వైసీపీ సానుభూతి పరులు, మరోసారి జనసేన సానుభూతిపరులు సమావేశాలు ఏర్పాటు చేశారు కూడా. కేవలం చంద్రబాబుకి నాలం కాకూడదనే కారణంతోనే ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ కూటమి ఓడిపోవాలని కోరుకున్నాయి. ఆయా సామాజికవర్గాల వారీగా కసరత్తు చేశాయి. ఇక సెటిలర్లు తెలంగాణ ఎన్నికల్లో కులాల వారీగా చీలడం వెనుక జనసేన, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపించాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఎన్నికలలో పోటీ చేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కు పరోక్షంగా మద్దతిచ్చింది. ఈ నేపధ్యంలోనే తెలంగాణాలో టీఆర్ఎస్ గెలుపు వైసిపికి తీవ్ర ఆనందాన్ని కలిగించింది.అందుకనే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలలో తెలంగాణలో మహాకూటమి పరాజయం, టీఆర్ఎస్ విజయాన్ని బాణాసంచా పేల్చి స్వాగతించారు.
అటు జగన్ , ఇటు పవన్ ఇద్దరూ ఒకరి మగతనం మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు కానీ ఇద్దరూ కలిసి టీఆర్ఎస్ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు…? ఒకరకంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ప్రారంభమైనప్పటి నుంచి వైసీపీ, జనసేనల హడావుడి ఎక్కువగా ఉంది. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసినప్పటి నుంచి మరింత ఎక్కువైంది. టీడీపీ, కాంగ్రెస్ తో పాటు. మరో రెండు పార్టీలతో జత కట్టడం అన్నది తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన అంశం. కానీ జనసేనతో పాటు జగన్ కూడా ఈ ప్రయత్నాలపై తీవ్రమైన విమర్శలు చేయడం ప్రారభించారు. ఇప్పుడు టీడీపీ ఓటమే వీరి విజయంగా ఫీలవుతున్నారా..? తెలుగుదేశం పార్టీ అధినేతగా తెలంగాణలో ఉన్న పార్టీ నేతలకు అండగా ఉండేందుకు చంద్రబాబు రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు. ఓడిపోతే ఎదుర్కోవాల్సిన పరిణామాలు గట్టిగానే ఉంటాయని తెలిసినా ముందడుగు వేశారు. కానీ జగన్, పవన్ లా ఎన్నికలకే దూరం కాలేదు. చంద్రబాబును ఓడించాలని కోరుకోవడం తప్పు లేదు కానీ ఎవరో ఓడిస్తే తాము సంతోషంలో మునగడంలో అర్థం లేదు. అది రాజనీతి కాదు కాదు. పోనీ కనీసం రాజకీయ లక్షణం కూడా కాదు. వీరు ఇలా బహిరంగ విమర్శలు బాబు మీద చేయడం వల్ల ప్రజల్లో చులకన అవుతామనే విషయాన్ని మాత్రం ఇరు పార్టీల అధినేతలు బేరీజు వేసుకోలేకపోతున్నారు. కేసీఆర్ను అంటే తెలంగాణను అన్నట్లుగా అక్కడి ప్రజలు భావించారు. రేపు మీరు చంద్రబాబుని అంటే ఎపీని అన్నట్టు అనే భావన ప్రజల్లో మొదలయ్యింది అంటే మీ పని గోవిందా ! అంటూ నెటిజన్లు ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు.