Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన విభజన హామీల విషయంలో మోడీ సర్కార్ చెబుతున్న పచ్చి అబద్ధాలు బయటకు వచ్చాయి. ఆ హామీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో నిజాలు నిగ్గు తేల్చడానికి జనసేన అధినేత చొరవతో నలుగురు మాజీ ఐఏఎస్ అధికారులు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో ఏర్పాటు అయిన నిజ నిర్ధారణ కమిటీ ఈరోజు నివేదిక బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం అసలు విభజన చట్టం రూపకల్పనలోనే ఎన్నో లోపాలు వున్నాయి. ఆ పాపం నాటి కాంగ్రెస్ ఖాతాలో పడింది. ఇక చట్టంలో ఇచ్చిన హామీల కింద మోడీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ 7 ముఖ్య అంశాల్లో దాదాపు 75 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని తేల్చింది.
ఈ విషయం చంద్రబాబు సర్కార్ కి ఊరట కలిగిందేదీ అయినప్పటికీ టీడీపీ ప్రభుత్వం చెబుతున్నట్టు హోదాకి ప్యాకేజ్ ప్రత్యామ్న్యాయం కాదని కూడా కమిటీ అభిప్రాయపడింది. ఇంత అన్యాయం జరుగుతున్నా నాలుగేళ్లుగా రాష్ట్ర సర్కార్ గట్టిగా పోరాటం చేయలేకపోవడాన్ని పవన్ తప్పు బట్టారు. రాజకీయ పాత్ర వల్ల జరిగిన విభజనకి సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పవన్ ఆవేదన చెందారు. ప్రత్యేక హోదా అంశంలో వెనక్కి తగ్గేది లేదని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. కమిటీ సభ్యులు ఏమి చెప్పారో బులెట్ పాయింట్స్ రూపంలో చూద్దాం.