Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సీఎం చంద్రబాబు… జనసేన అధినేత పవన్ ల భేటీలో పలు అంశాలపై చర్చ జరిగింది. చంద్రబాబుతో గంటపాటు పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఉద్దానం, పోలవరం, రాజధాని, మంజునాధ్ కమిషన్ సహా… తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. పవన్ ఉద్దాన్ బాధితుల అంశంపై చొరవ తీసుకోవడం తనకు సంతోషం కలిగించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు జీవన్‌దాన్ కార్యక్రమానికి… బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమని కోరినట్టు తెలిసింది. దానికి పవన్ కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఎంతో మంది కిడ్నీ బాధితుల సమస్యను తనదిగా భావించి సమస్య పరిష్కారానికి హార్వార్డ్ వైద్య బృందాన్ని సైతం రప్పించిన పవన్ జీవన్‌దాన్ కార్యక్రమానికి సరైన అంబాసిడర్‌గా చంద్రబాబు భావించినట్టు తెలుస్తోంది.
మరిన్ని వార్తలు: