Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్‌కు ‘గబ్బర్‌సింగ్’ సమయంలో శరత్ మరార్‌తో సన్నిహిత్యం పెరిగింది. అప్పటి నుండి మొన్నటి ‘కాటమరాయుడు’ చిత్రం వరకు ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా, ఆప్త మిత్రులుగా కనిపించే వారు. ఏ కార్యక్రమంకు వెళ్లినా కూడా జతగా వెళ్లడం జరిగింది. ఆ మద్య పవన్ పొలిటికల్ ట్రిప్ అంటూ విదేశాలకు వెళ్లినా కూడా పవన్‌తో పాటు శరత్ మరార్ వెళ్లడం జరిగింది. పవన్‌కు అత్యంత ఆప్తుడిగా పేరు తెచ్చుకున్న శరత్ మరార్ గత ఆరు నెలలుగా పవన్‌కు చాలా దూరంగా ఉంటున్నాడు. కాదు కాదు… శరత్ మరార్‌ను పవన్ కావాలని దూరంగా ఉంచుతున్నాడు. ప్రస్తుతం ఈ విషయం తెలుగు మీడియాలో హాట్ టాపిక్‌గా ఉంది.
ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఊహించుకుని చెబుతున్నారు. కాని అసలు విషయం ఏంటి అంటే ఆర్థిక లావాదేవీలు. అవును.. ఇద్దరి మద్య నెలకొన్న ఆర్థిక లావాదేవీల కారణంగానే పవన్ ఆయన్ను దూరంగా పెడుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తొస్తోంది. ‘గోపాల గోపాల’, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, ‘కాటమరాయుడు’ చిత్రాలను శరత్ మరార్ నిర్మించాడు. ఆ చిత్రాల్లో సర్దార్ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్లు కోట్లల్లో మునిగి పోయారు. దాంతో వారికి సాయం చేయాలని శరత్ మరార్‌కు పవన్ సూచించాడు. అందుకు ఆయన తర్వాత సినిమా వారికే ఇద్దాం అన్నాడు. ఆ తర్వాత కాటమరాయుడు చిత్రం వచ్చింది. కాటమరాయుడు చిత్రం సర్దార్ వల్ల నష్టపోయిన వారికి తక్కువ రేటుకు ఇవ్వాలని పవన్ సూచించినా కూడా శరత్ మరార్ వారికి ఆర్థిక సాయం చేద్దాం, ఈ సినిమాను కొత్త వారికి ఇద్దాం అంటూ పవన్‌ను ఒప్పించాడు. ‘కాటమరాయుడు’ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు సర్దార్ డిస్ట్రిబ్యూటర్లకు సాయం చేయమంటే శరత్ మరార్ చేతులు ఎత్తేశాడు. ఆ కారణంగానే పవన్ ఆయన్ను దూరం పెట్టినట్లుగా మెగా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
మరిన్ని వార్తలు: