Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్ పేరు వినగానే ఆయన అభిమానుల్లో ఓ వైబ్రేషన్. కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఆయన నేరుగా అభిమానులు, కార్యకర్తలతో మాట్లాడేది తక్కువ. ఆ బాధ్యత చూసేందుకు పవన్ తన చుట్టూ ఓ టీం ని ఉండేట్టు చూసుకుంటారు. వారే పవన్ తరపున కొన్ని పనులు చక్కబెడుతుంటారు. అలా పవన్ కోటరీలో ముఖ్య వ్యక్తి శరత్ మరార్. పవన్ తో సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు వంటి రెండు ప్లాప్ చిత్రాల నిర్మాతగా బయటికి తెలిసినా అంతకు మించి సంబంధాలు కొనసాగించారు ఆయన. అందుకే పవన్ ని కలవాలన్నా, ఏదైనా ముఖ్య విషయం చర్చించాలన్నా ముందుగా శరత్ మరార్ ని కలవాలని చిత్ర సీమలో చాలా మందికి తెలుసు. అయితే అదంతా గతమట. ఇన్నాళ్లు తన కుడిభుజంలా వ్యవహరించిన శరత్ మరార్ ని పవన్ కళ్యాణ్ దూరంగా పెట్టినట్టు తెలుస్తోంది. ఇందుకు సినిమా వైఫల్యాల కన్నా శరత్ వ్యవహారశైలి ముఖ్య కారణం అని తెలుస్తోంది.
ఒకప్పుడు చిరు, అరవింద్ కుటుంబాలతో వున్న సాన్నిహిత్యంతో శరత్ మరార్ వారి ఆధ్వర్యంలో నడిచిన మా టీవీ సీఈఓ గా వ్యవహరించారు. అప్పుడు కూడా ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని తట్టాబుట్టా సర్దుకున్నారు. అప్పట్లో మా టీవీ న్యూస్ విభాగం ఉండేది. సిబ్బంది మధ్య కొన్ని అంతర్గత కలహాలు ఉండేవి. వాటిని చక్కదిద్దమని అడిగితే శరత్ ఏమి చేశారంటే… డెస్క్ లో మాత్రమే పని చేసిన ఓ జూనియర్ ఉద్యోగి ని తెచ్చి రిపోర్టింగ్ కి ఇన్ ఛార్జ్ గా నియమించారు. తీరా ఆ ఉద్యోగికి ఆ కుర్చీలో కూర్చున్నాక ఏమి చేయాలో అర్ధం కాలేదు. ఆయన కింద ఎలా పని చేయాలో మిగిలిన వారికి అర్ధం కాలేదు. అప్పట్లో జర్నలిజం సర్కిల్స్ లో శరత్ నిర్ణయం ఓ పెద్ద కామెడీ ఎపిసోడ్. ఇప్పుడు అలాంటి నిర్ణయాలు ఏమి తీసుకున్నారో ఏమో గానీ పవన్ ఆయన్ని పక్కనబెట్టి మంచి పనే చేశారు.
మరిన్ని వార్తలు: