పవన్ అడిగి మరీ తన్నించుకునేట్టు ఉన్నాడుగా…!

Pawan Kalyan Comments On TDP AP Politics

ఏపీలో మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. నిజానికి పంచాయతీ ఎన్నికలు ఎప్పుడో జరగాలి. కానీ అన్ని ప్రభుత్వాల్లాగే ఏపీ ప్రభుత్వం కూడా ఎన్నికలు జరపకుండా ప్రత్యేక అధికారులను నియమించింది. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ ఏర్పడి ఐదేళ్లయినా ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్న అనుభవం లేని, సంస్థాగతంగా బలంగా లేని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమ పార్టీకి భయపడే టీడీపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించట్లేదు అంటూ విమర్శలు చేసారు. అయితే ఇప్పుడు హైకోర్టు ఆదేశంతో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే జనసేనకు పంచాయతీ ఎన్నికలు లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టాయనే అభిప్రాయం విశ్లేషకుల నుండి వ్యక్తమవుతోంది. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని పవన్ భావిస్తున్నారు. దానికే అన్ని నియోజకవర్గాల నుండీ ధీటైన అభ్యర్ధులే దొరకని పరిస్థిది ఇపుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు పంచాయతీ ఎన్నికల రూపంలో ముందే బరిలోకి దిగే అవకాశం జహాసేనకు వచ్చింది. పవన్ ఏదో ప్రాస కోసం టీడీపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించట్లేదు అంటూ విమర్శలు చేసారు కానీ నిజానికి పంచాయతీ ఎన్నికలు జరగడం జనసేనకు అంత మంచిదేమి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

pawan-cm-chandrababu-naidu

ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల మధ్య త్రిముఖ పోరు నడిచే అవకాశాలున్నాయి. దీంతో పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రధానంగా ఈ మూడు పార్టీల గెలుపు గురించి పట్టించుకుంటారు. అందునా టీడీపీ, వైసీపీ పార్టీలకు ఎన్నికలు కొత్త కాదు. ఎందుకంటే వారికి గ్రామస్థాయి నుంచి కేడర్ ఉంది. మండల, నియోజకవర్గ స్థాయి నేతలున్నారు. వారు పంచాయతీ ఎన్నికలు సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. కానీ రాష్ట్ర స్థాయి నేతలు తప్ప ఇంకా జిల్లాల కమిటీలు కూడా సరిగా లేని జనసేన పరిస్థితి బేలగా ఉంది. గ్రామస్థాయిలో నిర్మాణం జరగలేదు. మండల, నియోజకవర్గ స్థాయి నేతలు ఏర్పడలేదు. అసెంబ్లీ ఎన్నికలంటే పార్టీ అధ్యక్షుడిగా పవన్ ప్రచారం చేయొచ్చు కానీ పంచాయితీలకు చేయాలంటే ఒక యుగం చాలదు అది పవన్ అయినా చంద్రాబాబు అయినా సో ఎక్కడిక్కడ లీడర్లు, కేడర్ కావాలి. ఇవ్వన్నీ చూస్తుంటే పంచాయతీ ఎన్నికల్లో జనసేనకు చేదు అనుభవం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల మీద కూడా దాని ప్రభావం తీవ్రంగా పడుతుంది.

pawan-cm

అలా అని జనసేన పంచాయతీ ఎన్నికల్లో బరిలోకి దిగకుండా ఉంటె రెచగొట్టి దమ్ములేక పారిపోయింది అంటారు. ఎందుకంటే ఇప్పటికే పవన్ పలు సందర్భాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసారు. మొత్తానికి పంచాయతీ ఎన్నికలు జనసేనకు కష్టాలు తెచ్చిపెట్టాయిగా అంటున్నారు విశ్లేషకులు. చూద్దాం మరి జనసేన వీటిని ఎదుర్కుంటుందో ? లేక చతికిలబడి టీడీపీ వైసీపీలలో ఎవరికో ఒకరికి న్యాయం చేస్తుందో ? ఈ మొత్తం ఎపిసోడ్ మీద వివిధ వర్గాల వారు జోకులు పేల్చుకుంటున్నారు. ఈ పవన్ పడుక్కున గాడిదని అడిగి మరీ లేపి తన్నించుకునేట్టు ఉన్నాడుగా ! అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.