Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో సినిమా వారిపై శ్రీరెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెల్సిందే. శ్రీరెడ్డి పలువురు స్టార్స్‌ను టార్గెట్‌గా చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో దుమారంను రేపుతున్నాయి. తాజాగా శేఖర్ కమ్ములను దారుణంగా విమర్శించి, పలు ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి తీరుపై ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు సీరియస్ అయ్యారు. ఈమెను వదిలేస్తే ఇంకా ఎంతమందిపై విమర్శలు చేస్తుందో అనే ఉద్దేశ్యంతో ఆమెపై పోలీస్ కేసుకు సిద్దం అయ్యారు. తాజాగా ఫిలిం ఛాంబర్ ప్రతినిధి పవన్ కళ్యాణ్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
గత కొన్ని రోజులుగా శ్రీరెడ్డి సినిమా పరిశ్రమ వారిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ టాలీవుడ్ పరువు తీస్తుందని, ఆమె వల్ల పలువురు నటీనటులు మరియు దర్శకులు అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. మీడియాలో ఆమె ఇష్టానుసారంగా మాట్లాడటం వల్ల పలువురు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆమెకు ఏదైనా అన్యాయం జరిగితే పోలీసుల వద్దకు కాని, సినిమా పరిశ్రమ పెద్దల వద్దకు కాని వెళ్లవచ్చు. కాని ఆమె మీడియా ద్వారా పలువురిపై ఆధారాలు లేని అబాండాలు వేస్తుంది అంటూ ఆయన పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు త్వరలోనే శ్రీరెడ్డిని ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తోంది. ఇకపై అయినా శ్రీరెడ్డి సైలెంట్ అవుతుందేమో చూడాలి.