మోడీ అన్నయ్యా కాదు, అమిత్ షా బాబాయీ కాదు…!

Pawan Kalyan Controversial Comments On TDP Leaders

అమరావతిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని శనివారం ప్రారంభించిన పవన్ కల్యాణ్, అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్రంలో సంభవించిన పెను తుఫాన్ గురించీ రాష్ట్రంలోని జరుగుతోన్న ఐటీ దాడులతోపాటు వివిధ అంశాల గురించి మాట్లాడారు. తిత్లీ తుఫాన్ వల్ల దెబ్బతిన్న శ్రీకాకుళంలో తర్వలోనే పర్యటిస్తానని అన్నారు. ఇప్పటికిప్పుడు అక్కడకు వెళ్తే సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతోనే వెనకడుగు వేశానని తెలిపారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతోన్న ఐటీ దాడుల గురించి కూడా చర్చించామని ఆయన చెప్పుకొచ్చారు.

JanaSena Party New Office Opening In Vijayawada
ఢిల్లీలో జరిగినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయంలో ఐటీ సోదాలు చేస్తే తాము కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తామని కానీ ప్రయివేట్ సంస్థల్లో దాడులు చేస్తే, టీడీపీకి ఏంటి సంబంధం ? దీనిపై కూడా ఎలా స్పందించాలో అర్థం కావడంలేదని అన్నారు. అంతేకాదు, తాను బీజేపీ నేతలతో కుమ్మక్కు అయినట్లు టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై కూడా పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీ తనకేం అన్నయ్య కాదు, అమిత్ షా బాబాయి కూడా కాదు కనీసం బీజేపీ నేతలతో తనకు బంధుత్వం కూడా లేదని. నా కుటుంబాన్నే వెనుకేసుకురాలేదు అలాంటప్పుడు వారికి ఎలా మద్దతు ఇస్తాను అని ఆయన ప్రశ్నించారు.

janasena
కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చి, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తాను జనసేనను స్థాపించలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మభ్యపెట్టే మాటలతో ప్రయోజనం ఉండదని అన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరుకునేటట్టుయితే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, ప్రతినిధులను తీసుకుని ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవాలని కోరారు. తాను ఇంతవరకూ ప్రధానిని కలవలేదని, అఖిలపక్షానికి తాము కూడా వస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై పోరాటాలు చేద్దామని, మభ్యపెట్టే ప్రకటనలు చేయరాదని సూచించారు. అలాగే రానున్న తెలంగాణ ఎన్నికల్లో పోటీచేయాలా? వద్దా అనేది మరో నాలుగైదు రోజుల్లో వెల్లడిస్తామని పవన్ ప్రకటించారు.