Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కూడా నెమ్మదిగా జగన్ బాటలోనే నడుస్తున్నాడు, ఒకప్పుడు తన మీద వ్యతిరేక్ అవార్థాలు రాసిందన్న నెపంతో ఎబీయన్ ని జగన్ బహిష్కరిస్తే తాజాగా పవన్ కూడా అటువంటి నిర్ణయమే ప్రకటించారు. ఇది అందరికి తెలిసిన విషయమే. టీవీ9, టీవీ5, ఏబీఎన్ చానెళ్లను దూరం పెడుతున్నట్టు ప్రకటించారు. జనసైనికులంతా శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చిన పవన్ ఎలాంటి న్యాయపోరాటమయినా ఎదుర్కొంటానని ప్రకటించారు. అయితే ఇక్కడ పవన్ కొన్ని విషయాలని మరిచిపోయినట్టు అనిపిస్తోంది. మీడియా లేకపోతే రాజకీయ పార్టీలకు మనుగడ ఉండదని కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాలో జర్నలిస్టు పాత్ర పోషించిమరీ చెప్పిన పవన్, ఇప్పుడు రియల్ జీవితంలో ఓ రాజకీయ పార్టీ అధినేతగా మారి ఆ మీడియానే దూరం చేసుకుంటున్నారు.
ముందు నుండి చూస్తే జనసేన కార్యక్రమాలకు మీడియా మంచి మద్దతు ఇస్తూ వచ్చింది, మద్దతు ఇచ్చింది తమ తమ టీఆర్పీల కోసమే అయినా అది జనసేనకు క్రేజ్ రావడానికి ఉపయోపడింది. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ తన ఆలోచనారాహిత్యం వల్ల వారిని దూరం చేసుకుంటున్నారని చెప్పాలి. ఇప్పుడీ విషయం అంతా ఎందుకంటే మీడియా సంస్థలను టార్గెట్ చేసి ఒక నాలుగు చానెళ్ళని బహిష్కరించమన్న పవన్ కల్యాణ్ కు అదే స్థాయిలో దెబ్బ కొట్టేందుకు తెలుగ్గు టీవీ చానెళ్ళు అన్నీ ఏకమయినట్టు ప్రచారం జరుగుతోంది. పవన్ గనుక తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక పోతే పవన్ కల్యాణ్, జనసేన వ్యవహారాలు తమ చానళ్లలో ఇక రాకుండా చేసేందుకు తెలుగు టీవీచానళ్ల అసోసియేషన్ నిర్ణయం తీసుకుందని సమాచారం.
ముందుగా తమ వైపు నుండి తప్పు లేకుండా పవన్ కి హెచ్చరికలు పంపి అప్పటికి దారికి రాకుంటే పవన్ మీద బ్యాన్ విధించాలని వారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వమే ఓకే డ్రీం టీం అనే దాన్ని ఏర్పాటు చేసి తన మీద బురదజల్లేలా కుట్రలు చేస్తున్నారు అని ఆరోపిస్తూ రెచ్చిపోయి ట్వీట్లు చేస్తున్నారు పవన్. తన అభిమానులు… ఓ మీడియా సంస్థ వాహనాలను ధ్వంసం చేయడాన్ని కూడా ఖండించని పవన్, ఏ అలా చేస్తే తప్పేంటి అని ఓ పోలిస్ అధికారితో అన్నట్టు ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు దాంతో టీవీ చానళ్ల సంఘం ఈ కఠిన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది.
అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం పవన్ మీడియాతో కొర్రీలు పెట్టుకుంటే అది జనసేనకే నష్టం అని, మీడియా అనేది మన వెనుక లేకుంటే తెలుగుదేశం-వైసీపీలతో పోరాడాలంటే మీడియా సపోర్ట్ ఉండాలి అని వారు అభిప్ర్రాయపడుతున్నారు. పవన్ కల్యాణ్ ఇకనయినా మీడియా సంస్థలతో రాజీ కొచ్చి ఇక రాజకీయాల మీద ద్రుష్టి పెడితే మంచిది అని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ బీజేపీ-వైసీపీ-జనసేన కలిసి పోటీ చేయల్సి వచ్చిన జగన్ అనుకూల మీడియా జగన్ కి అత్త్యంత ప్రాధాన్యత ఇస్తుంది కాని పవన్ కి అంత ప్రాధాన్యత ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు.