‘అజ్ఞాతవాసి’లో పవన్‌ డబుల్‌ రోల్‌…?

Pawan Kalyan Double Role In Agnathavasi Movie
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే పవన్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’ మరియు ‘అత్తారింటికి దారేది’ చిత్రాు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్‌ 25వ చిత్రం కావడంతో త్రివిక్రమ్‌ చాలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని, అనుకున్న సమయం కంటే ఇంకా ఎక్కువ తీసుకుని మరీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమాపై ఆకాశాన్ని అంటేలా అంచనాున్న నేపథ్యంలో తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న ఒక వార్త ప్రస్తుతం అందరిలో అంచనాలను మరింతగా పెంచుతున్నాయి.

అజ్ఞాతవాసిలో పవన్‌ కళ్యాణ్‌ డబుల్‌ రోల్‌లో కనిపించబోతున్నట్లుగా పుకారు షికారు చేస్తోంది. అన్నదమ్ముళ్ల పాత్రల్లో పవన్‌ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. ఒక పవన్‌కు జోడీగా కీర్తి సురేష్‌ నటించనుండగా మరో పవన్‌కు అను ఎమాన్యూల్‌ జత అంటూ వార్తలు వస్తున్నాయి. పవన్‌ డబుల్‌ రోల్‌ అంటూ వస్తున్న వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో తీవ్రమైన చర్చకు తెర లేపుతుంది.

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ ఉన్న రేంజ్‌కు సింగిల్‌గా కనిపిస్తేనే బాక్సాఫీస్‌ వద్ద సందడి మామూలుగా ఉండదు, అదే డబుల్‌ రోల్‌లో పవన్‌ కనిపిస్తే ఇంకేమైనా ఉందా… గతంలో పవన్‌ ‘తీన్‌ మార్‌’ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశాడు. అయితే అప్పుడు రెండు విభిన్న జనరేషన్‌ల పాత్రల్లో నటించాడు. కాని ఈ చిత్రంలో మాత్రం ఒకే జనరేషన్‌ పాత్రలో పవన్‌ కనిపించబోతున్నాడు. మొత్తానికి పవన్‌ చేస్తున్న ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్ర రికార్డులను తిరగరాయడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్‌ నమ్మకంతో ఉన్నారు.