Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యువ రాజ్యం అధినేత గా రాజకీయ జీవితం మొదలుపెట్టిన పవన్ తర్వాత పరిణామాలతో రాజకీయాలకి దూరంగా జరిగి తర్వాత 2014 ఎన్నికల్లో ఒక రాజకీయ వేదికని బీజేపీ-తెలుగుదేశం కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే యువరాజ్యం నాయకునిగా ఉన్నప్పటి నుండే సభకి వచ్చిన జనాన్ని చూసి ఏదో ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడి ఎవరికీ ఏమీ అర్ధం కాకుండా కొన్ని సార్లు, నమ్మలేని అంశాలు మాట్లాడి నవ్విస్తూ కొన్ని సార్లు ప్రసంగాలు సాగిపోయేవి. ఒక రకంగా పవన్ మాటల్లో ఆవేశం ఉన్నా, తీరా అంతా పూర్తయ్యాక, ఆలోచిస్తే అందులోని భావం ఒక పట్టాన అర్ధంకాదు, అసలు పవన్ ఏమి చెప్పదలుచుకున్నాడో తెలీక, ఆయన వ్యూహం ఏంటో అర్ధం కాక ఆలోచనలో పడేవారు సభకి వచ్చిన జనాలు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ రాసుకొచ్చి గబ గబా చదివేసి వెళ్లిపోయేవాడు పవన్. కొన్నాళ్ళ పాటు ఇలా పవన్ కి స్క్రిప్ట్ రాసేది త్రివిక్రమ్ అనే భావించారు అంతా.
అయితే పవన్ కల్యాణ్ ప్రసంగాలను త్రివిక్రమ్ రాయడం లేదని “ పవన్, త్రివిక్రమ్‌కు మంచి స్నేహితుడు మాత్రమే. పవన్ చెప్పే ప్రసంగాలను త్రివిక్రమ్ రాసిస్తాడనేది పచ్చి అబద్ధం. ఆయనకు వేరెవరూ ప్రసంగాలు రాయాల్సిన పనిలేదు. అంటూ ఓ భజన బృంద నిర్మాత అన్న మాటలు అందరికి గుర్తుండే ఉంటాయి. అయితే ఇప్పటివరకు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే పవన్ చదువుతారు అనే ఆరోపణలకి ఈరోజు బలం చేకూరినట్లయ్యింది. పవన్ కళ్యాణ్ తన తల్లి వయసు కూడా తెలియని పరిస్థితిల్లో ఉన్నారంటారా ? ఈ ప్రసన అడిగితే పవన్ ఫ్యాన్స్ అని చెప్పుకునే బ్యాచ్ మా మీద కూడా విరుచుకుపదతారు ఏమో కత్తి మహేష్ మీద పడ్డట్లు, నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం, ఎందుకంటే పవన్ సొంతంగా రాసినట్టుఅయితే తన తల్లి వయసు తనకి తెలుసు కాబట్టి కరెక్ట్ గ వ్రాసేవాడు, కాని ఇది జీతగాళ్లో లేక జనసేన కంటెంట్ రైటర్ లో రాసిన విషయం కాబట్టే రాసిన వారు పవన్ వయస్సు 47 కాబట్టి వారి తల్లికి 70 ఉండొచ్చు అనే అంచనాతో కంటెంట్ రాసి ఇచ్చేసినట్టున్నారు.
పై పైన చదివేసిన పవన్ అప్రూవల్ చేసేసి ఉండొచ్చు. కాని పవన్ తో సహా శతగ్ని టీం మొత్తం మిస్సయిన లాజిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కి స్వయానా అన్న అయిన చిరంజీవి వయసు 63 అయినప్పుడు వారి తల్లి వయస్సు 70 ఎలా అవుతుందో మరి ఆ విషయం పవన్ కళ్యాణ్ కంటెంట్ రైటర్ లేకే ఎరుక…అసలు ఈ గుడ్డు మీద వెంట్రుకలు పీకే లాజిక్ లని అసలు ప్రస్తావనలోకి తెచ్చే ఉద్దేశ్యమే మాకులేదు, కాని ఇంతకు ముందు మేము చెప్పినట్టు నూటికి నూరు శాతం పవన్ బీజేపీ చేతిలో పావుగా మారి బీజేపీ పలికిస్తే పలుకుతున్నారు అనేది స్పష్టం అవుతుంది అని చెప్పటానికే మాఈ ప్రయత్నం. పోనీ ఈ విషయం పక్కన పెడితే దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్టు శ్రీ రెడ్డి ఆ మాట అన్న రెండు రోజులకి అది కూడా నేడు చంద్రబాబు దీక్షకి దిగుతున్న నేపధ్యంలో ఈ ట్వీట్లని ఒక్క సారిగా డంప్ చేయడం చూస్తుంటే ఖచ్చితంగా ఇది బాబు మీద మీడియా ద్రుష్టిని మరల్చాడానికి అని అర్ధం అవుతోంది. అంతే కాక ఇప్పుడే అందుతున్న సమాచారం ప్రకారం పవన్ మెగా ఫ్యామిలీ హీరోలు అందరితో కలిసి హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ కి వచ్చారు. పవన్ వెంట నాగబాబు, అల్లు అర్జున్ ఉన్నారు.
తనపై జరుగుతున్న కుట్రలపై న్యాయపోరాటానికి దిగాలని పవన్ నిర్ణయించారని ఈ నేపధ్యంలోనే నేటి ఉదయం ఫిలించాంబర్‌లో న్యాయవాదులతో పవన్ సమావేశమయ్యారుని మీడియాకి లీకులు అందడంతో అప్పటి దాకా బాబు దీక్షని లైవ్ ఇచ్చిన చానెల్స్ సైతం ఒక్కసారిగా అటేన్షన్ ని పవన్ మీదకి తిప్పాయి. గత ఆరు నెలలుగా కుట్రలు జరుగుతున్నాయని ప్రకటించిన పవన్ బాబు దీక్ష రోజే న్యాయవాదులని కలవడానికి రావడం చూస్తే పవన్ ఇంత దిగాజారిపోయాడా అనిపించక మానదు. రాత్రి ట్వీట్స పెట్టినా మీడియా ద్రుష్టి అంతా చంద్రబాబు దీక్ష మీదే ఉండటంతో ఏమి చేయాలో పాలుపోని పవన్ ఇలా ఫిలిం ఛాంబర్ బాట పట్టినట్టు అనుమానిస్తున్నారు విశ్లేషకులు, పాపం పవన్ ఇంతా దిగజారిపోయినా ఒక పది నిముషాలు పవన్ ని కవర్ చేసిన మీడియా ఛానెల్స్ మరలా చంద్రబాబు పోరాటాన్ని లైవ్ ఇవ్వడం కొసమెరుపు.