‘అతనితో’ రేణు నిశ్చితార్థం జరిగిపోయింది !

Pawan Kalyan EX Wife renu desai Gets Engaged

పవన్ మాజీ భార్య రేణూదేశాయ్ పవన్ తో విడిపోయినప్పటి నుండి ఎటువంటి ప్రకటనలు చేయని ఆమె ఈ మధ్యే రెండో పెళ్లి ఆలోచన ను బయట పెట్టింది. అయితే ఆమె బాధని అర్ధం చేసుకోని పవన్ ఫ్యాన్స్ ఆమెని రకరకాల కామెంట్లు చేసి ఆమె ఆగ్రహానికి గురయిన సంగతి తెల్సిందే. అప్పటి నుండి వెనక్కుతగ్గని రేణు రెండో పెళ్లి గురించిన విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేస్తూ వస్తోంది.

ఇటీవల తాజాగా, చేసిన ఓ పోస్ట్ లో తనకు ఎంగేజ్ మెంట్ జరిగినట్టు పేర్కొంది. తనకు కాబోయే జీవిత భాగస్వామి చేతిపై రేణూ దేశాయ్ చెయ్యేసిన ఫొటోలో ఎంగేజ్ మెంట్స్ రింగ్స్ ధరించి ఉండటం గమనించవచ్చు. బాధ నుంచి కోలుకునేందుకు తనకు సహాయంగా నిలిచిన నిజాయతీ మనసుకు ధన్యవాదాలంటూ తనకు కాబోయే భర్తకు థ్యాంక్స్ చెప్పింది. తన జీవిత భాగస్వామి ఎవరు? అనే విషయాన్ని ఈ పోస్ట్ లో ఆమె ప్రస్తావించలేదు.

పవన్‌ కల్యాణ్‌తో కొన్ని సంవత్సరాలు సహజీవనం చేశాక 2009లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత దాదాపు మూడేళ్లకు 2012లో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్యా ఉన్న విషయం తెలిసిందే. విడిపోయిన తర్వాత కూడా ఫంక్షన్లు, బర్త్‌డేలకు కలుస్తూనే ఉండేవారు పవన్‌ కల్యాణ్, రేణు దేశాయ్‌. అయితే అవి ప్యూర్లీ పిల్లలకు సంబంధించిన ఫంక్షన్స్‌ అనే వార్తలు ఉండేవి. అయితే ఇప్పుడు ఏకంగా ఒక వ్యక్తిని ఆమె పెళ్ళి చేసుకోనుండడంతో అతను ఎవరో అణా ఆశక్తి సర్వత్రా నెలకొని ఉంది.