మరో కామన్ ‘సెలెబ్రిటీ’ అవుట్ !

Common Man Nutan Naidu Eliminated From Bigg Boss 2

నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్-2 షో మొదటిలో సోసో గా సాగినా రోజులు గడుస్తున్న కొద్దీ ఆసక్తికరంగా మారుతోంది. నాని కూడా రోజురోజుకు మరింత రాటుదేలుతూ షోను రక్తికట్టిస్తున్నాడు.మొదటి వారం లో సెలబ్రిటీ అయినా కామన్ మ్యాన్ కోటా లో హౌస్ లో అడుగు పెట్టిన సంజన ఎలిమినెట్ అవగా ఇప్పుడు రెండో వారం కూడా సామాన్యుడి కోటాలో అడుగుపెట్టిన నూతన్ నాయుడు ఎలిమినేట్ అయ్యాడు.

ముందు నుండీ ఈ వారం కౌశల్ ఎలిమినేషన్ ఖాయమని చివరి వరకు అందరూ భావించినా అనూహ్యంగా హౌస్‌లో మొన్న జరిగిన గొడవ కారణంగా ప్రేక్షకుల్లో అతడిపై సానుభూతి పెరిగి విపరీతంగా ఓట్లు పడ్డాయి. దీంతో కౌశల్ సేఫ్ జోన్ లోకి వెళ్లి నూతన్ నాయుడు బలయ్యాడు. అలా సంజన హౌస్ నుంచి బయటకు రాగా, ఈసారి నూతన్ నాయుడు బయటకొచ్చాడు. దీంతో హౌస్‌లో సామాన్యుడి కోటాలో ఇక మిగిలింది ఒక్క గణేశ్ మాత్రమే. రానున్న వారం అతనే ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ అని సోషల్ మీడియా లో బిగ్ బాస్ మీద ట్రోల్స్ మొదలయ్యాయి.

షో నుంచి ఎలిమినేట్ అయిన నాయుడు బయటకు వచ్చిన అనంతరం హౌస్‌లో తనతో కలిసిపోయిన కౌశల్, దీప్తిలకు స్పెషల్ థాంక్స్ తెలిపాడు. ఆపదలో అండగా నిలిచారని, నిరాశగా ఉన్నప్పుడు ఉత్సాహం నింపారని చెప్పి చివరికి ‘బిగ్‌ బాంబ్‌’ను తన స్నేహితుడైన కౌశల్‌పై ప్రయోగించి వెళ్లిపోయాడు.