కత్తి మహేష్‌పై కోడిగుడ్లతో దాడి

pawan-kalyan-fans-attack-on-kathi-mahesh-with-eggs

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ ఎవడు, 10వ తరగతి చదువుకున్న పవన్‌ ఒక గొప్ప వ్యక్తి అంటూ ఆరాధించడం ఏంటీ అంటూ పవన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కత్తి మహేష్‌పై పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పవన్‌పై చిన్న విమర్శ చేస్తేనే ఊరుకోని ఫ్యాన్స్‌ కత్తి మహేష్‌ అన్నేసి మాటలు అంటుంటే ఎలా ఊరుకుని ఉంటారు చెప్పండి. అంతా భావిస్తున్నట్లుగానే కత్తి మహేష్‌పై దాడికి ప్రయత్నం జరిగింది. ఆయన్ను కొట్టేందుకు కొందరు పవన్‌ ఫ్యాన్స్‌ ప్రయత్నాలు చేశారు. కత్తి మహేష్‌ పక్కన ఉన్న కొందరు ఆయన్ను కాపాడగలిగారు. ఇక పవన్‌ ఫ్యాన్స్‌ కొందరు కత్తి మహేష్‌పైకి కోడిగుడ్లను విసిరేసి తమ నిరసన తెలియజేశారు.

గత కొన్ని రోజులుగా అనుకుంటున్న సంఘటన జరగనే జరిగింది. కత్తి మహేష్‌ చేస్తున్న వ్యాఖ్యలకు పవన్‌ ఫ్యాన్స్‌ రెచ్చి పోవడం దాడి చేయడం ఖాయం అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సంక్రాంతికి కత్తి మహేష్‌ ఆయన సొంత ఊరు వెళ్లిన సమయంలో కూడా కొందరు ఆయన్ను ఫాలో అయ్యారు. అప్పుడే దాడి జరుగనుందని భావించారు. కాని కత్తి మహేష్‌ కుటుంబ సభ్యులతో ఉన్న కారణంగా దాడి చేయలేదు అంటూ పవన్‌ ఫ్యాన్స్‌ స్వయంగా చెప్పుకొచ్చారు.

ఇక తాజాగా హైదరాబాద్‌లో ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చి అక్కడ నుండి బయటకు వెళ్తున్న సమయంలో కత్తి మహేష్‌పై కోడిగుడ్లతో దాడి జరిగింది. ఆ దాడిలో కత్తి మహేష్‌కు రెండు గుడ్లు తలిగాయి. ఆ తర్వాత కత్తి మహేష్‌ మళ్లీ తనపై దాడిపై స్పందించేందుకు టీవీ9 స్టూడియోకు వెళ్లారు. తనపై దాడిని ఖండివ్వాలంటూ పవన్‌ను డిమాండ్‌ చేశాడు.