గత కొద్ది రోజులుగా పవన్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ మధ్య సోషల్ మీడియాలో కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాను మరొక పెళ్లి చేసుకుంటానంటే పవన్ ఫ్యాన్స్ తనను తట్రోల్ చేస్తున్నారని తనని చంపేస్తానని అంటున్నారని రేణు చెప్పుకొచ్చింది. అంతేకాక పవన్ కల్యాణ్‌ను అభిమానించే అమ్మాయిలకు నాది ఒకటే ప్రశ్న, “మీరే పవన్ భార్య అయి, తను మీకు తెలియకుండా వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని తనతో ఇంకో పాపను కని ఉంటే ఏం చేసేవారు” అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రేణుదేశాయ్ చేసిన వ్యాఖ్యలు నెట్ లో వైరల్ గా మారాయి. పవన్ వ్యతిరేకులకి ఆ వ్యాఖ్యలు వరంగా మారడంతో ఆయన అభిమానులు ఇప్పుడు ఆమె మీద మరో డిఫెన్స్ మొదలుపెట్టారు.
రేణు మాటలను బట్టి పవన్ తో విడిపోవడానికి ముందే పొలెనా జన్మించిందని అంటోందని కానీ పవన్, రేణు దంపతులు 2011 మార్చిలో విడాకులు తీసుకుందని కానీ పొలెనా ప్రస్తుత వయసు ఐదేళ్లనీ, పొలెనా పుట్టాక పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పానని రేణు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారని. దీన్ని బట్టి వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకొని పాపను కని ఉంటే మీరైతే ఏం చేసేవారని రేణు వేసిన ప్రశ్న అసంబద్ధమైందని స్పష్టం అవుతోందనీ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఆమె ఫ్రస్టేషన్లో ఈ మాట అన్నారా..? లేదంటే ఎన్నికల సమీపిస్తోన్న తరుణాన ఆమెను రాజీయంగా ఎవరైనా ప్రభావితం చేస్తున్నారా ? అని జనసేనాని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పవన్‌తో విడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో రేణుదేశాయ్ చెప్పుకొచ్చారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం విడాకులు తాను కోరలేదని, ఆయనే విడాకులు ఇచ్చారని చెప్పారు. దీన్నిబట్టి ఆమె ఉద్దేశపూర్వకంగానే పవన్‌పై విమర్శలు చేస్తున్నారని ఫ్యాన్స్ వాదిస్తున్నారు. అయితే ఈ విషయాల మీద రేణు దేశాయ్ స్పందించాల్సి ఉంది.