బాబు ప్రయోగం పవన్ కి కలిసొస్తుందా?

pawan kalyan follow to chandrababu strategy for next elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో… ఎవరు ఏ వ్యూహంతో ముందుకు వస్తారో ఎప్పుడూ చెప్పలేము. ఇప్పుడు అదే జరగబోతోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఒకప్పుడు వాడి వదిలేసిన ఫార్ములాతో ముందుకు వచ్చేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎన్నికల్లో ఒకప్పుడు బాబుకు ఉపయోగపడ్డ ఆ ఫార్ములా ఎంతవరకు ఇప్పుడు పవన్ కి పనికి వస్తుందో గానీ ఆయన మాత్రం అదే రూట్ ని ఫాలో అయిపోతున్నట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.

pawan-kalyan--chandrababu

2019 ఎన్నికల్లో పోటీకి రెడీ అని చెప్పిన జనసేన అధినేత పవన్ పార్టీ నిర్మాణ పనుల్లో చురుగ్గా వున్నారు. ఇదే అదనుగా ఇటు అధికార పక్షం టీడీపీ, అటు విపక్షం వైసీపీ లో ఇమడలేకపోతున్న కొందరు నేతలు పవన్ ని సంప్రదించారట. అయితే జనసేనలోకి ఆ పాత నాయకుల రాకని పవన్ సున్నితంగా నిరాకరించారట. వీరి వల్ల పార్టీకి ప్రయోజనం కలగకపోగా అదనపు భారం పడుతుందని ప్రజారాజ్యం టైం లోనే అర్ధం అయినట్టు పవన్ చెప్పారట. అయితే అన్ని చోట్ల కొత్త నాయకత్వాన్ని తయారు చేయడంలో ఇబ్బందులను పార్టీ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న వారు పవన్ కి వివరించారట. అయితే దానికి కూడా ఓ మార్గం ఉందని పవన్ బదులు ఇచ్చారట. ఒకప్పుడు అంటే 1999 ఎన్నికల్లో బాబు తటస్తులు అన్న పేరుతో వివిధ రంగాలకు చెందిన వారిని పార్టీలోకి పిలిచి సీట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. అదే ప్లాన్ తో సామాజిక సేవ సహా ఇతర కీలక రంగాల్లో మంచి పేరు తెచుకున్నవారిని కలిసి పార్టీలో చేరాలని పవన్ కోరే అవకాశం ఉందట. నిజానికి 1999 ఎన్నికల్లో బాబు చేసిన ఈ ప్రయోగం ఫలించింది. ఇప్పుడు పవన్ కూడా అదే దారిలో వెళ్లే ఆలోచన చేస్తున్నారు. ఈ ఆలోచన సక్సెస్ అయితే జనసేన నిజంగా కొత్త తరహా రాజకీయాలకు తెర లేపినట్టే.