పవన్ భద్రత మీద అప్పుడలా… ఇప్పుడిలా?

Pawan Kalyan gets Security Problem in Janasena Porata Yatra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

2019 ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకుంటానని రంగం లోకి దిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉత్తరాంధ్రలో ప్రజా పోరాట యాత్ర శ్రీకాకుళం నుంచి ప్రారంభించారు. ఇప్పుడు సర్కార్ పవన్ సభకు బందోబస్తు తక్కువగా ఏర్పాటు చేసిందని. అదుపు చేయలేని అభిమానుల నడుమ పవన్ పోరాట యాత్ర భద్రత లేకుండా సాగుతుందని జనసేన ఆందోళన వ్యక్తం చేస్తోంది. దానికి తగ్గట్టుగానే నిన్న ఒక అభిమానిని బౌన్సర్ లు చితక బాదుతున్న విజుయల్స్ బయటకి వచ్చి వైరల్ అయ్యాయి. అయితే ఈ పరిణామం ముందు నుండి గమనిస్తే గుంటూరు లో ఆవిర్భావ సభ నుండి తెలుగుదేశం మీద ఆరోపణలు మొదలు పెట్టిన పవన్ తనకు కేటాయించిన పోలీస్ సెక్యూరిటీని నిఘాకు వినియోగిస్తున్నట్లు అనుమానపడి వారిని వెనక్కి తిప్పి పంపారు. నాకు మీరిచ్చే భద్రత అవసరం లేదన్నారు.

అయితే ఇప్పుడు మరలా ప్రజల్లోకి వెళుతున్న పవన్ కళ్యాణ్ కు పూర్తి స్థాయి భద్రత ఎందుకు కల్పించడం లేదని జనసేన ప్రశ్నిస్తుంది. తమ నేతకు ఏమి జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తుంది. నిన్న మొదలయిన యాత్రకు సంబంధించి ఇచ్ఛాపురం లో కానీ ఇతర ప్రాంతాల్లో జనసేనాని తలపెట్టిన కార్యక్రమాల్లో అనేక చోట్ల ఘర్షణలు, గందరగోళం చోటు చేసుకుంటున్నాయి. పవన్ పిలుపునిచ్చిన కవాతు కార్యక్రమంలో పవన్ పై దూసుకొస్తున్న అభిమానులను అదుపు చేయడం పవన్ ఆంతరంగిక రక్షకులకి సాధ్యం కావడం లేదు. పోలీస్ బందోబస్తు ఉన్నావారు వందల సంఖ్యలో ఉన్న అభిమానులని కంట్రోల్ చేయడం జరగని పని. ఒకప్పుడు భద్రత కల్పిస్తే వద్దు పొమ్మన్నది వారే ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలకోసం బద్రత లేదు ఏమయినా జరిగితే దానికి కారణం చంద్రబాబు అని వాదిస్తున్నదీ వారే అని తెలుగుదేశం నేతలు కొందరు వాదిస్తున్నారు. ఇప్పటికే వైకాపా-బీజేపీ-పవన్ లు కలిసి ఆపరేషన్ గరుడ లో భాగంగా చంద్రబాబును దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది అని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు పవన్ భద్రత చర్చనీయాంశంగా మారింది.