పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల మద్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒక్కటే అవ్వడం వల్ల మంచి మిత్రులు అయ్యారని అంటూ ఉంటారు సన్నిహితులు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ మినహా జల్సా అత్తారింటికి దారేది సినిమాలు మంచి విజయాలను దక్కించుకున్నాయి. పవన్ సినిమా ఇండస్ట్రీ వదిలిన తర్వాత త్రివిక్రమ్ గురించి ఇప్పటి వరకు రాజకీయ వేదికల గురించి ఎప్పుడు కూడా ప్రస్తావించలేదు. అయితే తాజాగా చిత్తూరు జిల్లాలో ఒక రాజకీయ వేదికపై త్రివిక్రమ్ పై పవన్ ప్రశంసల వర్షం కురిపించాడు. నెల్లూరులో విద్యార్థులతో పవన్ సమావేశం అయ్యాడు.
ఆ సందర్బంగా పవన్ మాట్లాడుతూ విద్యతో జ్ఞానం సంపాదించుకోవాలని జ్ఞానం అందించని విద్య వృదా అని విద్యార్థులు ఎవరైనా కూడా ఉన్న జ్ఞానంతో సరి పెట్టుకోకుండా ప్రతి రోజు కూడా ఏదో ఒక విషయంలో జ్ఞానం సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలని చెప్పుకొచ్చాడు, దానికి ఉదాహరణగా త్రివిక్రమ్ గురించి చెప్పిన పవన్ త్రివిక్రమ్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎంఎస్సీ చేశాడని అతడు ఆ రంగంలోనే కాకుండా ఇంకా ఎన్నో రంగాల్లో ప్రావిణ్యం పొందాడని ప్రతి నిత్యం కూడా త్రివిక్రమ్ ఏదో విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాడని విద్యార్థులు అంతా కూడా త్రివిక్రమ్ ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పుకొచ్చాడు. రాజకీయ వేదిక మీద మొదటి సారి పవన్ కళ్యాణ్ ఇలా త్రివిక్రమ్ గురించి మాట్లాడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.