మరో ఆప్షన్ పెట్టుకుంటున్న పవన్ !

Pawan Kalyan may contest from Srikakulam for next elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే విషయం మరలా తెర మీదకు వచ్చింది. ఇంతకు ముందు పవన్ కల్యాణ్ తాను అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా శ్రీకాకుళంలో పర్యటించిన పవన్ కల్యాణ‌్ తాను శ్రీకాకుళం జిల్లా నుంచే పోటీచేసే అవకాశాలు ఉన్నట్లు చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటివరకు ఏ ఎన్నికలను పరిశీలించినా టీడీపీ ఏదో ఒక పార్టీతో జతకలిసే పోటీ చేసిందని కానీ జనసేన ఒంటరిగానే పోటీచేసి విజయం సాధిస్తుందని చెప్పారు. అన్నీ కుదిరితే తాను శ్రీకాకుళం జిల్లా నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు.

చంద్రబాబుకు కృష్ణా జిల్లాపై ఉన్న మక్కువ మరే జిల్లాలపై లేదని… రాజధాని అమరావతి టీడీపీ వాళ్లకు మాత్రమేనని, అక్కడ సామాన్యులకు చోటులేదని విమర్శించారు. ‘రూ.25 కోట్ల ఆదాయపు పన్ను కట్టిన నాలాంటి వాడికే రాజధానిలో చిన్న స్థలం కొనడానికి నాలుగేళ్లు పట్టింది. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి అని ఆయన ప్రశ్నించాడు. ముందు నుండీ పరిశీలిస్తే మారుమూల వెనకబడిన ప్రాంతాలపైనే తొలి నుంచి పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలపైనే ఆయన ఎక్కువ శ్రద్థ కనబరుస్తున్నారు. ఈ నేపధ్యంలో అనంతపురం జిల్లాలో పార్టీకి ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. తాజాగా ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న జనసేనాని అక్కడి సమస్యలను చూసి చలించిపోయి తాను సిక్కోలు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. పవన్ వ్యాఖ్యలను పరిశీలిస్తే రాయలసీమ లోని అనంతపురం, ఉత్తరాంధ్ర జిల్లాలలోని శ్రీకాకుళం ఇలా రెండు స్థానాల నుండి పోటీ చేసే అవకాశం దండిగా కన్పిస్తోంది.