ఇవాళ విశాఖకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పయనం కానున్నారు. ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో బాధిత మత్స్యకారులను పరామర్శించనున్నారు. అగ్ని ప్రమాద బాధిత మత్స్యకారులకు రూ. 50 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని జనసేన అధిపతి అందజేయనున్నారు. మత్స్యకారులకు ఆపత్కాలంలో అండగా ఉంటామని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఇవాళ మధ్యాహ్నం విశాఖ చేరుకొని ఫిషింగ్ హార్బర్ లోని ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. బాధిత మత్స్యకారులతో పవన్ స్వయంగా మాట్లాడనున్నారు.
ఆదివారం అర్ధరాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 60 కి పైగా మరబోట్లు దగ్ధమైనట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే…విశాఖ హార్బర్ లో అగ్ని ప్రమాదంలో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఓ యూట్యూబర్ పై కేసు నమోదు చేసి…విచారణ చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది.