Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర కొద్దిసేపటి కిందట తన రాజకీయ యాత్ర ప్రారంభించారు . ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో జనసేన పరిపాలన కార్యాలయం దగ్గర మొదలైన ఆయన చేలొరే చేలొరే యాత్ర షెడ్యూల్ ఇలా వుంది.
- హైదరాబాద్‌లో బయల్దేరి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయానికి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చేరుకుంటారు.
- అక్కడ ఆలయంలో ఆంజనేయస్వామికి పూజలు చేస్తారు.
- అనంతరం తన యాత్ర ప్రణాళికను వెల్లడిస్తారు.
- సాయంత్రం కరీంనగర్ చేరుకుని జనసేనకు చెందిన స్థానిక ముఖ్య ప్రతినిధులతో మాట్లాడతారు.
- ఈ నెల 23న కరీంనగర్‌లోని జగిత్యాల రోడ్లో ఉన్న శుభం గార్డెన్స్‌లో ఉదయం 10.45 గంటలకు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల జనసేన కార్యకర్తలతో సమావేశమవుతారు.
- మధ్యాహ్న భోజనం అనంతరం కొత్తగూడెం బయల్దేరి వెళతారు.
- రాత్రికి కొత్తగూడెంలో బస చేస్తారు. 24న ఉదయం 9.30 గంటలకు కొత్తగూడెం నుంచి ప్రదర్శనగా బయల్దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు.
- 3 గంటలకు ఖమ్మంలోని ఎంబీ గార్డెన్స్‌లో జరిగే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.
- అనంతరం హైదరాబాద్‌కు పయనమవుతారు.