Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్ శ్రీకాకుళంలోని కిడ్నీ బాధితుల సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వం స్పందించాలని 48 గంటల సమయం ఇస్తున్నానని ఆలోపు పూర్తి స్థాయి వైద్యమంత్రిని నియమించి, ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలుగుదేశం ప్రభుత్వానికి ఇచ్చిన డెడ్ లైన్ శుక్రవారంతో ముగిసింది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చర్యలు చేపట్టిందో వివరించడం వరకే చెయ్యడంతో పవన్ కళ్యాణ్ దీక్షకు కూర్చుంటున్నట్టు సమాచారం. రెండు రోజులుగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల దాట్ల రిసార్టులో రెస్ట్ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ ఒక రోజు దీక్షకు కూర్చోనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే చాలు సార్లు పవన్ కళ్యాణ్ నిరాహారదీక్షకు కూర్చుంటా అని ప్రకటించినా ఇదే మొదటిసారి ఆయన దీక్షకు కూర్చోవడం. అదీ కాక నిరాహార దీక్షలు అంటే ఏదయినా బహిరంగ ప్రదేశంలో చేస్తారు కానీ పవన్ రేసార్తులోనే దీక్ష చేయడం అదీ మీడియా వారిని అనుమతించకుండా కేవలం జనసేన మాత్రమె పవన్ దీక్ష వీడియోలు విడుఅల చేసేలా ప్లాన్ చెయ్యడం ఇదేదో కొత్త రకం దీక్షలా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ దీక్షకు సంబంధించిన ప్రకటన కాసేపట్లో జనసేన పార్టీ చేయ్యవచ్చని తెలుస్తోంది. ఈరోజు సాయత్రం 5 గంటల నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు జనసేనాని దీక్ష చేయనున్నారని తెలుస్తోంది. అయితే పవన్ తలపెట్టిన ఒక్కరోజు దీక్ష వల్ల ఎటువంటి ఉపయోగమూ లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.