Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చరిష్మా గురించి ప్రతి తెలుగు వాడికి తెలుసు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాలు చేసే ఆలోచన లేదని చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. డీలా పడ్డారు. ఇకపై రాజకీయాలకే పరిమితం అంటూ జనసేన అధినేత హోదాలో పవన్ చేసిన ప్రకటన అటు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ప్రభావం ఏమీ చూపించలేదు. కానీ ఫిలిం ఇండస్ట్రీలో మాత్రం ఎక్కడ చూసినా ఇదే చర్చ. ప్లాప్స్, హిట్స్ తో సంబంధం లేకుండా పవన్ కి ఇండస్ట్రీ లో ఓ క్రేజ్ వుంది. ఆయన ప్లాప్ సినిమాలు సైతం కొందరు హీరోల హిట్ సినిమాలంత వసూలు చేస్తాయి. ఇవన్నీ తెలిసి కూడా పవన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, అంత కన్నా సాదాసీదాగా ప్రకటించడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా సరే సినిమాలు తీస్తాడని నమ్మే అయన పొలిటికల్ రంగ ప్రవేశాన్ని ఫ్యాన్స్ ప్రోత్సహించారు. కానీ వాళ్ళు ఊహించని ప్రకటనతో పవన్ ఇక పై వెండితెరపై మెరిసిపోడన్న చేదు వాస్తవాన్ని భరించలేకపోతున్నారు. పాలిటిక్స్ కోసం తాను ఏ స్థాయి త్యాగం చేస్తున్నానో చూడాలని పవన్ కూడా అడిగారు. కానీ నిజాలు వేరుగా వున్నాయి.
పవన్ ఇక సినీ రంగానికి గుడ్ బై అని ప్రకటన చేసే ఒక్క రోజు ముందే గూగుల్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తెలుగు ప్రజలు ఏ విషయాల మీద ఎక్కువగా ఇంటరెస్ట్ చుపిస్తున్నారో తన విశ్లేషణ ద్వారా వెల్లడించింది. పవన్ కళ్యాణ్ గురించి గూగుల్ లో వెదికే వారిలో ఎక్కువ మంది ఆయన సినిమాల గురించి వెదికిన వాళ్లే. అందులో సగం మంది కూడా పవన్ రాజకీయ ప్రస్థానాన్ని పట్టించుకోవడం లేదన్నది చేదు నిజం. భవిష్యత్ లో రాజకీయ యవనిక మీద పవన్ ముద్ర ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. కానీ ప్రస్తుతానికి జనం జనసేనానిని చూడడం కన్నా పవర్ స్టార్ గా ఆరాధించడానికి సిద్ధంగా వున్నారు. పవన్ కి ఈ విషయం ఇష్టం కావొచ్చు లేక కష్టంగా అనిపించవచ్చు. కానీ అది వాస్తవం.