తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో కూటమి కోసం చేస్తున్న ప్రయత్నాలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ లా అనిపించాయట, ఎంతయినా సినిమా మనిషి కదా అందుకే ఆయన ఫీలింగ్స్ ని సినిమాటిక్ గా చెప్పారు. సినిమా రిలీజ్ ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తారని చంద్రబాబు, రాహుల్ గాంధీ కలయిక ఇతర పార్టీల నేతలతో కూటమి కోసం చర్చలు కూడా ప్రీరిలీజ్ ఫంక్షన్ లాగే ఉందన్నారు. మా అన్న కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ నేను రాష్ట్రం కోసం టీడీపీకి మద్దతు ఇస్తే.. టీడీపీ వెళ్లి అదే కాంగ్రెస్‌తో కలవడం ఎంతవరకు సమంజసమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. చివరకు చంద్రబాబు ఎక్కడ మొదలయ్యారో అక్కడికే వెళ్లారని తేల్చారు. జగన్ పై జరిగిన కోడి కత్తి దాడిపైనా పవన్ కల్యాణ్ రైలు యాత్రలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
జగన్‌పై దాడి విషయంలో ప్రభుత్వం వెకిలిగా మాట్లాడ్డం సరికాదన్నారు. రాజకీయ జోక్యం లేకుండా విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలని జగన్ పై దాడిని షర్మిల, విజయమ్మే చేయిచారనడం సరికాదని కొడుకుపై తల్లి దాడి చేయిస్తుందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉందని తాను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొననని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. చింతమనేని తీరు ఇంకా మారలేదని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు కూటమి కోసం చేస్తున్న ప్రయత్నాలను… పవన్ కల్యాణ్ సినిమా ఫంక్షన్ తో పోల్చడం రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది. బీజేపీకి వ్యతిరేకంగా పెడుతున్న ఫ్రంట్ పై అది వ్యతిరేక స్పందనే అన్న అభిప్రాయం అన్ని పార్టీల నేతల్లో ఉంది. ఏపీని మోసం చేసిన బీజేపీని పల్లెత్తు మాట అనకుండా పవన్ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు.
బీజేపీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటకాగుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే విమర్శిస్తున్నారు. అందుకే.. కేంద్రం అమలు చేయాల్సిన విభజన హామీల మీద కూడా తననే విమర్శిస్తున్నారని కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన సూటిగా అడుగుతున్నారు. దానికి పవన్ కల్యాణ్ విచిత్రంగా కవర్ చేసుకుంటున్నారు. మా అన్ననే ఎదిరించి వచ్చాను.. ఇక మోడీ ఎంత..? అమిత్ షా ఎంత..?, వాళ్లేమీ నా బాబాయ్‌లు కాదు. వాళ్ల మాటలు ఎందుకు వింటారా ? నాకేమీ వేల కోట్ల ఆస్తులు లేవు నాకెందుకు భయం..? అంటూ వాదన వినిపిస్తున్నారు. కానీ.. అసలు విషయం మాత్రం మర్చిపోతున్నారు. మోడీ, షాలను ఎందుకు కనీసం ఓ మాట ప్రశ్నించడానికి కూడా వెనుకాడుతున్నారు.
ఎందుకు ప్రత్యేకహోదా ఇవ్వడం లేదని నినదించలేకపోతున్నారు..? ఎందుకు రైల్వేజోన్, స్టీల్ ఫ్యాక్టరీ, పోర్టు గురించి ప్రశ్నించలేకపోతున్నారు…? ధర్మపోరాట దీక్షల్లో మోడీని బూతులు తిడుతున్నారని గౌరవం ఇవ్వాలని పవన్ కల్యాణ్ అంటున్నారు. హోదా కోసం ప్రధానిని కలవొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారని ఒకవేళ కేంద్రంతో విభేదించాల్సి వస్తే ఓ క్రమం ఉంటుంది. ప్రధానిని కలిసి పద్దతిగా అడుగుతాం గొడవ చేస్తాం.. చివరిగా రోడ్డుపైకి వస్తాం. మీరు ఇస్తారా ఇవ్వారా.. ఇవ్వకుంటే చెప్పండి.. మేం తేల్చుకుంటాం ’అంటూ ఆవేశంగా ప్రసంగించారు పవన్. మరి ఇప్పుడు చంద్రబాబు మాత్రం చేసింది ఏమిటో అప్పుడు నిద్రావస్థలో ఉన్న పవన్ కెలా తెలుస్తుంది మన పిచ్చి కాకపోతే.