ఇవాళ మరో స్టార్ ఇంట వేడుకలు జరుగుతున్నాయి. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారు అకిరా నందన్ పుట్టినరోజు. ఈ సందర్బంగా పవర్ స్టార్ కుమారుడికి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అకీరాను సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల మొదటి సంతానం అయిన అకిరా నందన్. పవన్ కల్యాణ్ తర్వాత వారసుడు ఎవరు అంటే అకిరా నందన్ అని చెబుతుంటారు ఆయన ఫ్యాన్స్. ఇక అకిరా కూడా తనకు వీలు దొరికినప్పుడల్లా తండ్రి దగ్గరకు వస్తుంటాడు. అటు పెదనాన్న చిరంజీవి ఫ్యామిలీతో కూడ అకీరా కలిసే ఉంటాడు. పండగలు, పబ్బాలకు అకిరా మెగాస్టార్ ఇంటికి వెళ్తాడు.
ఇక రేణుదేశాయ్ దగ్గర పవన్ పిల్లలు అకీరా, ఆద్యా ఉంటున్నారు. రేణు కూడా అకిరా కెరీర్ విషయంలో చాలా పక్కాగా ముందుకు వెళ్తున్నారు. 2004లో పుట్టిన అకిరా వయసు ప్రస్తుతం 16 ఏళ్లు. ఇప్పటికే అకిరా మరాఠీలో ఓ సినిమా చేశాడు. రేణు దేశాయ్ తెరకెక్కించిన ఇష్క్ వాలా లవ్ సినిమాలో అకీరా నటించాడు. దీన్ని తెలుగులో అనువదించాలని చూస్తున్నారు. దాంతో పాటు పవన్ వారసున్ని నేరుగానే ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. మరికొన్ని రోజుల్లోనే దీనిపై వివరాలు కూడా బయటికి రానున్నాయి. ఒకవేళ పవన్ వారసుడి ఎంట్రీ ఖరారైతే దాన్ని ఎవరు నిర్మిస్తారు.. దర్శకుడు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇండస్ట్రీలో ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలోనే అకీరా తొలి సినిమాను నిర్మిస్తాడని తెలుస్తుంది. సొంత నిర్మాణ సంస్థలోనే తమ్ముడు సినిమా ఉండబోతుందనే ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే చెర్రీకి పవన్ అన్నా వపన్ పిల్లలన్నా చాలా అభిమానం. అందుకే పండగలు వచ్చేటప్పుడు పట్టుబట్టి మరీ అందర్నీ కలిపి ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకునేలా చరణ్ ప్లాన్ చేస్తుంటాడు. అందుకే అకిరా సినిమా తీస్తే కనుక ఆ బాధ్యతల్ని కూడా చెర్నీనే తనపై వేసుకుంటాడని టాలీవుడ్లో లాక్ కూడా వినిపిస్తుంది.