Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడే విషయంలో తమ ప్రయత్నం తాము చేస్తామని, తమ ప్రయత్నాలు ఎంతమేరకు విజయవంతమవుతాయో చూడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ దస్ పల్లా హోటల్ లో జరుగుతున్న జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జేఎఫ్ సీ సమావేశంలో పాల్గొంటున్న వారికున్నంత జ్ఞానం, సబ్జెక్ట్ తనకు లేవని, కానీ చలించే హృదయం ఉందని తెలిపారు. తాను పార్టీ పెట్టడానికి రాష్ట్ర విభజనలో జరిగిన అన్యాయమే కారణమన్నారు. ప్రభుత్వాలు మాటిచ్చాక వాటిని అమలు చేయకపోతే ప్రజల్లో అశాంతి నెలకొంటుందన్నారు. ప్రజల్లో అశాంతి చెలరేగితే దేశం ముక్కలవుతుందని హెచ్చరించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా సమస్యలు ఉన్నాయని, పాలకులు చేసిన తప్పుకు పేద ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
న్యాయం జరగనప్పుడు నా దేశంలో నేను ద్వితీయ శ్రేణి పౌరుడినన్న భావన కలిగి ప్రజల్లో అసంతృప్తి కలుగుతుందని అన్నారు. మాట ఇచ్చి తప్పించుకుంటే ఆ ప్రభావం నేటి జనరేషన్ పై పడకపోయినా, వచ్చే తరంపై పడుతుందని, అది ఎటుదారితీస్తుందో తెలియదని, దేశసమగ్రతకు భంగం కలిగి అతివాదం, తీవ్రవాదాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఉత్తరాది,దక్షిణాది పౌరులమంటూ విడిపోవాల్సి వస్తుందని, వేర్పాటు వాదానికి బలమైన వాతావరణం ఏర్పడుతుందని హెచ్చరించారు. మీరు ఇచ్చిన పాట నిలబెట్టుకోలేనప్పుడు చట్టాలను నేనెందుకు పాటించాలని ప్రతి ఒక్కరిలో తిరుగుబాటు ధోరణి వస్తుందని తెలిపారు. ఆక్వా ఫుడ్ పార్క్ విషయంలో తాను బాధితులతో మాట్లాడినప్పుడు వారు తీవ్రతరంగా పోరాడతామని అన్నారని, ఉద్ధానంలోనూ బాధితులను పట్టించుకునేవారు లేరని, ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించిందని, విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.