Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే అక్టోబర్ నుండి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తాను అంటూ తాజాగా అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తల సమక్షంలో చెప్పుకొచ్చాడు. ఈ అక్టోబర్ నుండి 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తాను అంటూ పార్టీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడు. అయితే పవన్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్తే సినిమాల పరిస్థితి ఏంటా అని ఆయన అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆలోచనల్లో పడ్డారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన 25వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు.
ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా పూర్తి చేయాల్సి ఉంది. కాని పవన్ అటు ఇటు అంటూ రాజకీయాలు అంటూ తిరుగుతుండటంతో సినిమా పూర్తి అయ్యేందుకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో ఒకటి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒకటి ఉంది. అక్టోబర్‌లో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాలు అంటున్నాడు కనుక త్రివిక్రమ్ సినిమాతో ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పెట్టి, ఎన్నిక తర్వాత మళ్లీ పవన్ సినిమాలు చేసే అవకాశాలున్నాయని కొందరు భావిస్తున్నారు. కాని పవన్ కళ్యాణ్ పలు సార్లు ఇలా ప్రకటించాడు. ఎన్నికల వరకు ఆయన సినిమాలు చేస్తుంటాడు, ఎందుకంటే ఆయనకు డబ్బులు చాలా అవసరం. అందుకే ఆయన సినిమాలను వదిలి పెట్టడు అని కొందరు అంటున్నారు. మొత్తానికి పవన్ సినిమాల గురించి ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్‌టాపిక్ నడుస్తుంది.
మరిన్ని వార్తలు: