పవన్‌ను ఒప్పించడం త్రివిక్రమ్‌కే సాధ్యం

pawan-kalyan-to-sing-once-again-trivikrams-new-film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Pawan Kalyan To Sing Once Again Trivikram New Film

పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేయడం అంటే దర్శకులు తమ క్రియేటివిటీని పక్కకు పెట్టాల్సిందే అనేది టాలీవుడ్‌లో ఒక వర్గం వారి వాదన. అంటే దర్శకులు అనుకున్నట్లుగా కాకుండా పవన్‌ కళ్యాణ్‌ సూచించినట్లుగా సినిమా తీయాల్సి ఉంటుంది. ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రం సమయంలో ఆ విషయం క్లీయర్‌గా స్పష్టంగా తేలిపోయింది. దర్శకుడు బాబీ ఆ విషయాన్ని అనధికారికంగా పదే పదే చెప్పాడు. అయితే త్రివిక్రమ్‌కు మాత్రం ఇందులో మినహాయింపు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్‌ కళ్యాణ్‌ పూర్తిగా త్రివిక్రమ్‌ను నమ్ముతాడు. దాంతో త్రివిక్రమ్‌ ఏమి చెప్పినా కాదనకుండా చేస్తాడు.

త్రివిక్రమ్‌ గతంలో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు పవన్‌తో చేశాడు. ప్రస్తుతం మరో సినిమాను చేస్తున్నాడు. పవన్‌ కళ్యాణ్‌ ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో కాటమరాయుడా.. అంటూ పాట పాడాడు. ఇప్పుడు మరోసారి పవన్‌తో పాట పాడివ్వాలని త్రివిక్రమ్‌ భావించాడు. అందుకు పవన్‌ కూడా ఓకే చెప్పాడు. త్రివిక్రమ్‌ కోరిన వెంటనే పవన్‌ పాట పాడేందుకు సిద్దం అయ్యాడు. మరి కొన్ని రోజుల్లో పవన్‌తో పాట పాడివ్వడం జరుగుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇంకా ఈ సినిమాలో పవన్‌ను కొత్తగా చూస్తారు అనేది చిత్ర యూనిట్‌ సభ్యుల మాట. త్రివిక్రమ్‌ తనదైన మార్క్‌తో పవన్‌లోని కొత్త యాంగిల్స్‌ను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా చేయడం కేవలం త్రివిక్రమ్‌కు మాత్రమే సాధ్యం అనేది అందరి మాట.

మరిన్ని వార్తలు :

తేజస్వి, అనీష ఆంబ్రోస్‌ స్వలింగ సంపర్కులా?

 స్పందించిన వెంకటేష్‌ ఫ్యామిలీ