Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన అధినేత పవన్ ఎప్పుడు బయటకు వస్తున్నా వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు విశాఖ పర్యటనకు పవన్ వస్తున్నాడు అనగానే అలాగే మాటల దాడి మొదలైంది. పవన్ విశాఖ తో పాటు ఆంధ్రాలో మరికొన్ని ప్రాంతాల్లో పర్యటన విషయం తెలియగానే వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో ప్రతికూల కధనాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. వైసీపీ ఇంతలా ఉలిక్కిపడ్డానికి ప్రధాన కారణం పవన్ సీన్ లోకి ఎంటర్ అయితే జగన్ పాదయాత్ర ప్రాధాన్యం తగ్గుతుందని భావించడమే. పైగా కొన్ని రోజులుగా పవన్ కూడా పాదయాత్ర చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు పవన్ యాత్రల వల్ల ఒరిగేది ఏమీలేదని ప్రచారం మొదలు పెట్టాయి.
పవన్ యాత్రల వల్ల ప్రతిసారి బాధితులకు ఎంతోకొంత మేలు జరిగింది. అమరావతి రైతులు మొదలుకుని ఉద్దానం కిడ్నీ బాధితుల దాకా ప్రతి ఒక్కరికీ ఎంతోకొంత మేలు జరిగింది. జగన్ యాత్రల ద్వారా ఆ మాత్రం మేలు జరిగిందిందెక్కడా లేదు. పైగా బాధితులు ఏ విషయం మొరపెట్టుకున్నా పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టు తాను సీఎం అయితే ఆ సమస్య తీరుస్తానని చెప్పడం తప్ప నిర్మాణాత్మక సలహాలు ఇచ్చింది లేదు. సమస్యల పరిష్కారం కోసం పోరాడింది లేదు. ఇప్పుడు పవన్ ముందుకు వస్తుంటే ముందస్తు గానే విమర్శలు చేయడం చూస్తుంటే ఏదో పాత సామెత గుర్తుకు వస్తోంది.