తాజాగా విశాఖ జిల్లాలో ఎల్ జి పాలిమర్స్ పరిశ్రమ నుంచి వెలువడిన స్టెరిన్ విష వాయువు ఘటన సంచలనం రేపుతోంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం వారు ఇప్పటికే సహాయక చర్యలను మరింత వేగవంతం చేసారు. ఇలా దేశ వ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనపై స్పందిస్తూ ప్రధాని మోడీ సైతం ట్వీట్ పెట్టారు. అలాగే ఏపీలో ఉన్న ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా తమ వంతు స్పందనను అందించారు.
వారితో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తూ ట్వీట్ చేసారు. జనసేన పార్టీ తరపున ఘటన స్థలానికి మా పార్టీ జెనరల్ సెక్రటరీలు ఇద్దరు శివశంకర్ మరియు బొలిశెట్టి సత్యలను పంపుతున్నాంనై తెలిపారు. అలాగే అలాగే విశాఖ మరియు ఉత్తర తీర ఆంధ్రలో పారిశ్రామిక రక్షణా ఆడిట్ ను పెట్టాలని అలాగే పలు పరిశ్రమల వల్ల కాలుష్యం ఏర్పడ్డ జోన్లలో కూడా ఈ సేఫ్టీ ఆడిట్ ను ఈఎఎస్ శర్మ గారు మరియు జనపరెడ్డి గారు డిమాండ్ చెయ్యాలని పవన్ సూచించారు.
విశాఖ దుర్ఘటన హృదయవిదారకం …
•కాలుష్య నియంత్రణ మండలి కఠినంగా వ్యవహరించాలి
విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువులు విడుదలై అయిదు కిలోమీటర్ల మేర ప్రజల భయకంపితులు కావడం…— Pawan Kalyan (@PawanKalyan) May 7, 2020