అమెరికా పర్యటనలో బిజీ అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. టూర్‌లో భాగంగా వాషింగ్టన్‌లో అక్కడి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సెక్రటరీ బెన్ కార్సన్ ప్రముఖులతో భేటీ అయ్యారు. వెనుకబడ్డ ప్రాంతాల్లో పెట్టుబడులు రాబట్టేందుకు గల సాధ్యాసాధ్యాలపై బెన్ కార్సన్‌తో చర్చించామని జనసేనాని తెలిపారు. ఈ మేరకు పవన్ పర్యటన వివరాలు, ఫోటోలను ట్వీట్ చేశారు. వాషింగ్టన్ తర్వాత పవన్ న్యూయార్క్‌లో పర్యటిస్తున్నారు. బ్లూమ్ బర్గ్ అనే ప్రముఖ ఫైనాన్షియల్ ఎనలిస్ట్ జనసేనానిని ఇంటర్వ్యూ చేశారు. డిసెంబర్ 13వ తేదీన ఎన్ఆర్ఐ జనసేన నేతలతో సమావేశం కానున్న జనసేనానీ…డిసెంబర్ 15వ తేదీన డల్లాస్‌లో ప్రవాస గర్జన్ పేరిట నిర్వహించే కవాతులో పాల్గొననున్నారు. అదే రోజు నిర్వహించే బహిరంగసభలో పవన్ ప్రసగించనున్నారు. పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు, పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలపై సుదీర్ఘంగా పవన్ ప్రసంగించనున్నారని తెలుస్తోంది. కాగా, ఈ పర్యటన విషయంలో ఒకింత ఉత్కంఠ నెలకొంది.
పర్యటనకు రెండ్రోజుల ముందు పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గొంతు నొప్పి,తీవ్ర జ్వరంతో బాధపడినట్లు సమాచారం. పవన్‌ను పరిక్షీంచిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చికిత్స అందించినట్లు సమాచారం. ఈ పరిణామాల వల్ల పవన్ అమెరికా టూర్‌పై సందిగ్దత నెలకొంది. అయితే, స్వల్ప విశ్రాంతి అనంతర పవన్ అమెరాకాకు బయల్దేరారు. ఇదిలాఉండగా, అమెరికాలో పర్యటిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తనతో పాటుగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను వెంట తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులను కలిసిన ఫోటోలను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు.