Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర కి పూర్తి స్థాయిలో మైలేజ్ రావడానికి ఏమి చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు. జగన్ ఆదేశం వుందో ,లేదో తెలియదు గానీ ఇప్పటికే ముద్రగడ ని కాస్త సైలెంట్ కమ్మని వైసీపీ నాయకుల నుంచి సూచన వెళ్లిందట. అయితే ఇలా ఆలోచించేవాళ్ళు ఓ విషయం మర్చిపోతున్నారు. ముద్రగడని ఆపొచ్చు గానీ జనసేన ను క్రియాశీలం చేస్తున్న పవన్ కళ్యాణ్ ని ఎలా ఆపగలరు. ఇప్పటికే పార్టీ నిర్మాణంలో చురుగ్గా వ్యవహరిస్తున్న పవన్ ఏ క్షణమైనా రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధం కావొచ్చని తెలుస్తోంది. పవన్ చేసేది పాదయాత్రా లేక బస్సు యాత్ర అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
పవన్ ఏ యాత్ర తలపెట్టినా రేపు ఓట్ల సంగతి పక్కనబెడితే జనం మాత్రం ఆయన్ని చూసేందుకు ఎగబడడం ఖాయం. అదే సమయంలో ఇంకో నేత జగన్ పాదయాత్ర జరుగుతుంటుంది కాబట్టి సహజంగానే పోలికలు వస్తాయి. జగన్ ఇప్పటికే ఎన్నోసార్లు జనంలో తిరిగి వున్నాడు కానీ పవన్ రావడం ఇదే తొలిసారి. అందుకే వైసీపీ వర్గాల్లో పవన్ ఇప్పట్లో యాత్రకి సంబంధించిన ప్రకటన రాకుండా ఉంటే బాగుండని అనుకుంటున్నారు. అందుకే పైకి జనసేన అనే పార్టీ మాకు లెక్కే కాదు అని చెబుతున్న వైసీపీ లోలోపల మాత్రం ఆ పార్టీతో పొత్తుకు విశ్వప్రయత్నం చేస్తోంది.
వైసీపీ కి మేలు చేయడానికి మీడియా ముసుగులో తహతహలాడుతున్న కొమ్మినేని శ్రీనివాసరావు ఇటీవల ఓ వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ విషయాన్ని చెప్పుకొచ్చారు. జనసేన, వైసీపీ కలిస్తే 2019 ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే పవన్ తో పొత్తు వైసీపీ కి ఎంత అవసరమో కొమ్మినేని లాంటి వారి కామెంట్స్ చూస్తే అర్ధం అవుతుంది.