పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం చాలా విభిన్నంగా ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇష్టం లేకుండానే సినిమాల్లోకి వచ్చాడు, ఇష్టం లేకుండానే స్టార్ అయ్యాడు. చదువుపై ఆసక్తి చూపించని పవన్ కళ్యాణ్‌ను ఆయన అన్న చిరంజీవి బలవంతంగా సినిమాల్లోకి తీసుకు వచ్చాడు. చదువురాని నువ్వు కనీసం హీరో అయినా అవ్వాల్సిందే అంటూ బలవంతంగా సినిమాల్లో నటింపజేశాడు. తండ్రితో పాటు అన్న ఒత్తిడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ హీరోగా మారాడు. రెండు మూడు సినిమాలు పూర్తి చేసే వరకు కూడా సినిమాలపై ఇష్టం కగలేదు. తనకు ఇష్టం లేని సినిమా కోసం ఎక్కువగా కష్టపడటం పవన్‌కు ఇష్టం ఉండేది కాదు. సుస్వాగతం చిత్రం సందర్బంగా షూటింగ్లో ఇబ్బందికి గురై ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాను అంటూ చెప్పుకొచ్చాడు.
తాజాగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో మెగా ఫ్యాన్స్‌తో భేటీ అయిన పవన్ కళ్యాణ్ తన అన్నకు తనకు ఉన్న అనుబంధంపై చాలా సమయం మాట్లాడాడు. అన్నయ్య అంటే తనకు తండ్రితో సమానం అంటూ చెప్పుకొచ్చాడు. అన్నయ్య చిరంజీవి సినిమాల్లోకి బలవంతంగా తీసుకు వచ్చాడు. సినిమాల్లోకి రాకుంటే తాను ఉగ్రవాదిని అయ్యేవాడినేమో అంటూ పవన్ చెప్పుకొచ్చాడు. ‘సుస్వాగతం’ చిత్రం షూటింగ్లో భాగంగా వందలాది మంది చూస్తుండగా బస్‌పైకి ఎక్కి డాన్స్ చేయాల్సి ఉంది. అలా చేయడంకు చాలా ఇబ్బంది పడ్డాను. నాకున్న సిగ్గు మరియు బిడియంతో ఆ సీన్ చేయలేక తన వదినకు ఫోన్ చేసి చనిపోవాలనుకుంటున్నాను అంటూ చెప్పాను. ఆమె సర్ది చెప్పడంతో నేను ఆలోచన వెనక్కు తీసుకున్నాను అంటూ పవన్ చెప్పుకొచ్చాడు. తన అన్న, వదిన తల్లి తండ్రితో సమానం అంటూ ఈ సందర్బంగా పవన్ చెప్పుకొచ్చాడు. మెగా ఫ్యాన్స్‌ను జనసేనలోకి ఆకర్షించడం కోసం ఇలా పవన్ వ్యాఖ్యలు చేసినట్లుగా అనిపిస్తుంది.