Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్ గోపాల్ వర్మ తనపై శ్రీరెడ్డితో చేయించిన విమర్శలకు నిరసనగా నేడు ఉదయం హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌కు పవన్ రావడం ఆయన వెంట నాగబాబు, అల్లు అర్జున్, రాం చరణ్ అందరూ ఒక్కరొక్కరుగా ఛాంబర్ కి చేరుకోవడం చూసి అంతటా ఉత్కంట నెలకొంది. న్యాయవాదులతో కలిసి చర్చిన పవన్ తదుపరి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు అని భావించారు, కాని కాని పవన్ మీడియాతో మాట్లాడకుండానే ఇంటికి వెళ్లి పోయాడు.
అయితే ట్విట్టర్ వేదికగా ఏం జరిగిందో.. ఎందుకు చాంబర్‌కు వచ్చారో వివరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి పవన్ చాంబర్లోనే ఉన్నారు. తన తల్లిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బాధ్యులపై న్యాయపరమైన పోరాటం చేయాలని పవన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా కొందరు న్యాయవాదులతో పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు అరవింద్ సమావేశమయ్యారు. తదుపరి ‘మా’ అసోషియేషన్ సభ్యులతో, నిర్మాతల మండలి సభ్యులతో కూడా ఈ వ్యవహారంపై పవన్ చర్చించినట్లు తెలిసింది. ఎవరూ ఈ వ్యవహారంపై మీడియాకు వెళ్లి చర్చల్లో పాల్గొనవద్దని ఇది సున్నితమైన అంశమని, తొందరపడి ఎవరూ వ్యాఖ్యలు చేయొద్దని పవన్ ఈ సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది.
పవన్ ఛాంబర్ లో ఉన్న విషయం తెలుసుకుని పవన్ అభిమానులు భారీ ఎత్తున చాంబర్ కు చేరుకోవడం జరిగింది. అభిమానులు పవన్ ను అన్యాయం చేసిన వారి అంతు చూస్తామని నినాదాలు చేస్తున్నారు. అభిమానిల్ని కంట్రోల్ చెయ్యడం పోలిసుల వల్ల కావడం లేదు. అందుకు పవన్ ను ఇంటికి వెళ్ళమని పోలీస్ వారు కోరినట్లు పోలిస్ వారి విజ్ఞప్తి మేరకే పవన్ చాంబర్ నుండి ఇంటికి వెళ్ళడం జరిగిందని ప్రచారమవుతున్నా పవన్ మౌనం వెనుక రాం గోఅప్ల్ వర్మ చేసిన ట్వీట్ ఉన్నట్లు అనిపిస్తోంది.
ఎందుకంటే నిన్న రాత్రి పవన్ వరుసగా ట్వీట్లు చేసి రామ్ గోపాల్ వర్మ సహా, చంద్రబాబు, లోకేష్, టీవీ9 రవిప్రకాష్, ఏబీయన్ రాధాకృష్ణల మీద కొన్ని ఆరోపణలు, అభియోగాలు చేశారు. అయితే వాటికీ వర్మ లాజికల్ గా సమాధానం ఇచ్చారు. దీంతో ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు ని, లోకేష్ ని, రవి ప్రకాష్ నీ వర్మని మరో సారి విమర్శిస్తే ఇంకొద్ది సేపు అటెన్షన్ దివేర్ట్ చేసినట్టు అవుతుందని భావించినా వర్మ లాజికల్ గా అడిగిన ఆ ప్రశ్నల వల్లనే పవన్ ఇంటి బాట పట్టడాన్న విషయం అర్ధమవుతోంది. ఎందుకంటే ఒకవేళ ప్రెస్ మీట్ అర్పాటు చేస్తే మీడియా వాళ్ళు కచ్చితంగా పవన్ ని వర్మ కౌంటర్ గురించి అడుగుతారు అటేన్షన్ కోసం పోతే ఆయనే కార్నర్ అయ్యే అవకాసం ఉండడంతో పవన్ వెనుదిరిగినట్టు తెలుస్తోంది.