పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందిచడం,డైరెక్టర్ సముద్ర ఖని దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం బ్రో. చాలా కాలం తరువాత మాస్ లుక్ లో అలరించడానికి మన ముందుకు జులై 28, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతుంది .ఈ ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.రిలీజైన ఫస్ట్ సింగిల్ మై డియర్ మార్కండేయ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ ” బ్రో సినిమా లో వచ్చిన సాంగ్ కోసం కష్టపడ్డానని ఆ పాటను మాస్ గా చేయలేము. సామెతలు లాగానే చెప్పాలి. ప్రత్యేక గీతాలు లాంటివి స్వరపరచలేము. ఇది కొన్ని పరిధులు ఉన్న సినిమా.. అన్నింటినీ కలిపి శ్లోకాలతో ఒక పాటలా విడుదల చేయబోతున్నాం. అంతేకాకుండా మొత్తం నాలుగు పాటలు ఉంటాయి. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ అద్భుతంగా నటించారు. సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయి. మై డియర్ మార్కడేయ సాంగ్ వివరిస్తూ “మల్లి పుట్టి భూమీదకి రానే రావు నిజం తెలుసుకో ఉన్నదంతా టైం లోనే అంతో ఇంతో అనుభవించిపో,మనల్ని ఆపే మగాడెవడు బ్రో, ఎంటర్టైన్మెంట్ కు ఇస్తా గ్యారెంటీ మీరు హ్యాపీ అయితే చాలు అదే రాయాలిటీ ” ఇవన్నీ ఉండేలా చేసుకున్నానని థమన్సం తెలిపారు . ఈ సినిమాలో కీలక పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తుంది.ఓ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతే లతో పవన్ , సాయి ధరమ్ తేజ్ స్టెప్పులు వేయడం జరిగింది.ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.