వచ్చే ఎన్నికలలో కనీసం కొన్ని ఎమ్మెల్యే సీట్లు అయినా గెలుచుకోవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలను ఆకట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా గతంలో తాను మొదలుపెట్టిన వారాహి యాత్రను ఎంతో విజయవంతంగా ఇప్పటి వరకు నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు మూడు దశలలో వారాహి యాత్రను నడిపించడం జరిగింది. కాగా తాజాగా పవన్ కళ్యాణ్ నాలుగవ విడత వారాహి యాత్ర పూర్తి షెడ్యూల్ ను విడుదల చేశారు.
ఈ షెడ్యూల్ ప్రకారం చూస్తే… అక్టోబర్ 1వ తేదీ నుండి వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుండగా, కృష్ణ జిల్లాలోని అవనిగడ్డ డిగ్రీ కాలేజ్ లో మధ్యాహ్నం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. అక్టోబర్ 2వ తేదీన కృష్ణ జిల్లాలోని జనసేన నాయకులతో భేటీ అయ్యి రాజకీయ పరిస్థితులు మరియు ఎన్నికల వ్యూహాల గురించి చర్చించనున్నారు.ఇక అక్టోబర్ 3న జనవాణి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.. అక్టోబర్ 4న పెడన లో పర్యటించనుండగా , అక్టోబర్ 5న కైకలూరు లో పర్యటిస్తారు.