త్రివిక్రమ్ కథ విని నిద్రపోయిన పవన్ కళ్యాణ్‌.. ఆ సినిమాకేనా..?

త్రివిక్రమ్ కథ విని నిద్రపోయిన పవన్ కళ్యాణ్‌.. ఆ సినిమాకేనా..?
Latest News

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేలేదు. త్రివిక్రమ్ రైటర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దర్శకుడిగా మారిపోయాడు . ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. త్రివిక్రమ్-పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మద్య ఎంత మంచి స్నేహబంధం ఉందో ప్రత్యేకంగా వివరించి చెప్పనవసరం లేదు . టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లిస్టులో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ముందు వరుసలో నే ఉంటారు. పైగా రీఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ చేసే ప్రతి మూవీ పనులను త్రివిక్రమే దగ్గర ఉండి చూసుకుంటున్నాడు.

త్రివిక్రమ్ కథ విని నిద్రపోయిన పవన్ కళ్యాణ్‌.. ఆ సినిమాకేనా..?
Atadu

ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ ఓకే అన్న తర్వాతే పవన్ కళ్యాణ్ ఏ మూవీ కు అయినా కమిట్ అవుతాడు. అలాంటి వీరిద్దరి మధ్య గతంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అది చాాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఒకానొక సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ చెబుతుండగా పవన్ కళ్యాణ్ నిద్రపోయాదంట . దీంతో త్రివిక్రమ్ చాలా నిరాశ చెందాడట. ఇంతకీ అది ఏ సినిమాకు అంటే..? అతడు మూవీకి అంట. వాస్తవానికి మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ ఇది. జయభేరి ఆర్ట్స్ పతాకంపై డి. కిషోర్, ఎం.రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తే.. కోట శ్రీనివాసరావు, సోనూ సూద్, సోయాజీ షిండే, ప్రకాష్ రాజ్, నాజర్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలను పోషించారు.

మణిశర్మ స్వరాలు సమకూర్చారు. 2005 ఆగస్టు 10న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్ గా మాత్రం విజయం సాధించలేకపోయింది. కానీ టెలివిజన్ లో మాత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే మొదట ఈ మూవీ ను త్రివిక్రమ్ ఉదయ్ కిరణ్ తో చేయాలని అనుకున్నాడు. కథ నచ్చడంతో ఆయన కూడా వెంటనే ఓకే చెప్పారు. అయితే షూటింగ్ ప్రారంభం అయ్యే టైమ్ కు ఉదయ్ కిరణ్ కి డేట్స్ ఖాళీగా లేకుండా పోయాయి. దాంతో ఆయన తీసుకున్న అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేశాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కు చెప్పగా ఆయన కథ వింటూనే నిద్రపోయారు. దాంతో చాలా నిరాశ చెందిన త్రివిక్రమ్ అక్కడి నుండి సైలెంట్ గా వెళ్ళిపోయారట. ఇక నాని సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు ను కలిసి అతడు స్టోరీని త్రివిక్రమ్ నేరేట్ చేసి మెప్పించాడు. అలా వీరి కాంబోలో అతడు సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమా థియేటర్స్ కంటే టెలివిజన్ లోనే బాగా ఆడింది.