Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అప్పట్లో అన్నయ్య వచ్చి పార్టీ పేరుతో జనాన్ని ముంచాడు. కాంగ్రెస్ తో పార్టీ విలీనం చేసి సమకాలీన రాజకీయాల్లోనే అతిపెద్ద డీల్ సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు తమ్ముడు కూడా పార్టీ పేరుతో జనాన్ని ముంచడానికి తయారయ్యాడు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ తరపున ప్రచారానికి కోట్లు తీసుకున్న పవన్.. 2019లో ఓన్ బిజినెస్ కు రెడీ అయ్యాడు. ఇదీ జనసేనపై వ్యతిరేకుల అభిప్రాయం.
ఈ వాదన పూర్తిగా నిజం కాకపోయినా.. అసలు నిజం కాదు అని మాత్రం చెప్పలేం. ఎందుకంటే పవన్ కూడా మెల్లగా చిరంజీవి బాటలోనే నడుస్తున్నడు. ఏ అంశంపైనా క్లారిటీ లేకపోవడం, ఎవర్ని ఎప్పుడు ఎలా చూస్తాడో చెప్పలేకపోవడం వంటి అంశాలు ఇద్దరిలోనూ కామన్ గానే ఉన్నాయి. కాసేపు పార్టీ పటిష్ఠత అంటాడు, మరోవైపు ప్రజలే ముఖ్యం అంటాడు.. అసలు పవన్ తీరు జనసేన క్యాడర్ కే అంతుచిక్కడం లేదు.
కనీసం పీఆర్పీ పెట్టే ముందు చిరంజీవి చాలా కసరత్తు చేశారనే టాక్ ఉంది. కానీ పవన్ అది కూడా చేస్తున్నట్లు కనిపించడం లేదు. తోచింది చేయడం, నోటికొచ్చింది మాట్లాడటం తప్ప.. పవన్ కు ఏ విషయంపైనే అవగాహన లేదని ప్రూవ్ అవుతూనే ఉంది. మాస్ ఇమేజ్ ఉంది కాబట్టి క్యాష్ చేసుకుందామనే తపనే ఎక్కువగా కనిపిస్తోంది. లేకపోతే జనసేన రిక్రూట్ మెంట్ అనే పదానికి అర్థమేంటో జనసేనానే చెప్పాలి.
మరిన్ని వార్తలు: