జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ NDA నుంచి బయటకు వచ్చానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా పెడనలో మాట్లాడుతూ…’NDA నుంచి బయటకు రావడం ఇబ్బందిగా ఉన్నప్పటికీ తప్పలేదు. TDP బలహీన పరిస్థితులో ఉంది. మీ పార్టీ అనుభవం రాష్ట్రానికి అవసరం అని మద్దతు తెలిపా. మీ అనుభవం, జనసేన పోరాట పటిమ కలిస్తే జగన్ ను పాతాళానికి తొక్కేయవచ్చు. కేంద్రం కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.
అలాగే, పెడనలో నిన్న జరిగిన బహిరంగ సభ వేదికగా మంత్రి జోగి రమేష్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ‘మీ దురాగతాలను మేము మర్చిపోలేదు. భవిష్యత్తులో వీటన్నింటికీ మీరు చట్టపరమైన సమాధానం చెప్పాలి. జన సైనికులను కట్టేసి కొట్టారని తెలిసింది. విచారణకు సిద్ధం కావాలి. ఏ జైలుకు పంపాలనేది చూద్దాం. రాజమండ్రి కంటే బెటర్ జైలుకు పంపుదాం. టిడిపి-జనసేన కలిసి… వైసిపిని తరుముదాం’ అని పవన్ వాక్యానించారు.





